శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శార్వరీ నామ సంవత్సర జ్యేష్ట బహుళ అమావాస్య రోజున అనగా ది.21-06-2020 ఆదివారము నాడు మృగశిర, ఆరుద్ర నక్షత్రములలో మిధున రాశి, యందు రాహుగ్రస్త సూర్యగ్రహణము( గ్రహణం స్పర్శ కాలము: ఉ.10.25 నిం.లు , గ్రహణ మధ్య కాలము: మ.12.08 నిం.లు , గ్రహణ మోక్షకాలము : మ.01.54 నిం.లు ) ఏర్పడుచున్న సందర్భముగా ఆలయ స్థానాచార్యులు మరియు వైదిక కమిటీ సభ్యుల వారి సూచన మేరకు ఆగమ శాస్త్ర ప్రకారము గా దేవాలయము ది.20-06-2020, శనివారము రోజు సాయంత్రం శ్రీ అమ్మవారికి పంచహారతులు నిర్వహించిన అనంతరం దేవాలయ కవాట బంధనము చేయబడును. తిరిగి గ్రహణానంతరం ది.21-06-2020 ఆదివారము మ.2 - 30 గం.లకు ఆలయము శుద్ధి పరచి, ప్రధానాలయ మరియు ఉపాలయముల దేవతామూర్తులకు స్నాపనాది కార్యక్రమములు నిర్వర్తింపజేసి శ్రీ అమ్మవారికి పంచహారతులు నిర్వహించిన అనంతరం సా.07 గం.లకు ఆలయము యధావిధిగా మూసివేయబడి, మరుసటి రోజు అనగా ది.22-06-2020 ఉదయం 06 గం.లకు భక్తులను అమ్మవారి దర్శనము నకు అనుమతించబడునని, ఈ సందర్భముగా ది.21-06-2020 ఆదివారము రోజున జరుగు అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేయడమైనదని తెలియజేయడమైనది. ముఖ్య గమనిక: గ్రహణం సందర్భముగా దేవాలయ కవాట బంధనము యొక్క ఫోటోలు మరియు వీడియో లు మీడియా మిత్రులకు దేవస్తానము మీడియా గ్రూపు నందు పంపించబడును. కావున మీడియా మిత్రులు గమనించగలరు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల సేవలో.. కార్యనిర్వహణాధికారి.


Comments