జీవకోటి ఆరోగ్యం కొరకు తిరుమలలో సూర్యగ్రహణ జపయజ్ఞం తిరుమల, 21 జూన్ 2020 (కలియుగ నారద) : కరోనా వైరస్ నశించి, ప్రపంచంలోని సమస్త జీవకోటి ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారికి విన్నవిస్తూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఆదివారం రాహుగ్రహ చూడామణి సూర్యగ్రహణ జపయజ్ఞం నిర్వహించారు. టీటీడీ నిర్వహించిన ఈ జప యజ్ఞంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్స్వామి, ధర్మకర్తల మండలి సభ్యులు కృష్ణమూర్తి వైధ్యనాథన్, ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, జెఈవో పి.బసంత్కుమార్, శ్రీవారి ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. …………………………….. ఓం నమో వేంకటేశాయ వాట్సాప్ : 9392877277


Comments