*అధికారులు.. ఇవేం కరోనా పరీక్షలు..!!* కరోనా పరీక్షలలో అయోమయాలు నెలకొంటున్నాయి. క్రమ పద్దతి లేకుండా ఫలితాలు వెలువడుతున్నాయట. ఇవాళ నెగటివ్‍ ఫలితాలు వస్తున్నాయి. తరువాత పాజిటివ్‍ ఫలితాలు వస్తున్నాయట. ఎక్కడైతే కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించారో.. ఆయా ప్రాంతాల ఫలితాలలో గందరగోళం నెలకొందని కరోనా బాధితులు వాపోతున్నారు.. కరోనా పరీక్షలు నిర్వహించాక.. కొందరికి రెండు, మూడు రోజులలో ఫలితాలు వెల్లడిస్తున్నారు. మరి కొందరికి పది రోజులు తరువాత కూడా ఫలితాలు వెల్లడించటం లేదట. ఆన్‍లైన్‍లో చెక్‍ చేస్తే.. శాంపిల్‍ సెంట్‍ అని మాత్రమే కనిపిస్తుంది. ఫలితాలపై క్లారిటీ ఇస్తే కొందరు పనులు చక్కపెట్టుకోవాలి.. మరి కొందరు ఉద్యోగాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఫలితాలు త్వరగా ప్రకటిస్తే.. అటు బాధ్యతలు నెరవేర్చుకోవచ్చు. పనులు చక్కపెట్టుకోవచ్చు. మళ్లీ కొత్తగా పరీక్షలు చేయించుకోవాలంటే 21 రోజుల వరకు ఎదురు చూడాల్సిందే. ఎవరైతే ఐడి రిజిస్ట్రేషన్‍ చేసుకుంటారో.. అలాంటి వారికి 21 రోజుల అనంతరం పరీక్షలు చేస్తారు. ఒక వేళ ఫలితాలపై స్పష్టత ఇవ్వకుంటే.. మళ్లీ పరీక్షలు చేయించుకోవల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఆలస్యంగా ఫలితం వస్తే.. అది ఫాల్స్ నెగటివ్‍గా పరిగణించబడుతుంది. దానర్ధం ఏమిటంటే.. ఆ నమూనాలో పాజిటివ్‍ ఉన్నప్పటికీ… 13 రోజులు కరోనా బతికే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి పరీక్షలు నిర్వహించవద్దని పరీక్షలు చేయించుకున్న వారు చెబుతున్నారు. ఒక ఉద్యోగికి కరోనా నిర్దారణ కోసం పరీక్షలు చేశారు. మొదట్లో పాజిటివ్‍ వచ్చింది. అతనిని ఐసోలేషన్‍ వార్డుకు పంపించారు. వాళ్ల కుటుంబ సభ్యులను కూడా కరోనా ఉంటుందన్న నమ్మకంతో హోం క్వారంటైన్‍కు తరలించారు. కానీ ఆ ఉద్యోగికి కరోనా పాజిటివ్‍ నిర్దారణ కాగా ఆయన కుటుంబ సభ్యుల ఫలితాలు వెలువడలేదు. హోం క్వారంటైన్‍లో వారందరూ ఉంటే.. చుట్టు పక్కల వారు హడలి పోతున్నారు. బాధ్యత గల అధికారులు ఎవరూ ఈ విషయాలపై దృష్టి సారించట్లేదట. పలానా ప్రాంతాలలో కరోనా పరీక్షలు నిర్వహించండి అని ఆదేశాలు ఇస్తారు. మేమే పరీక్షలు నిర్వహించి ల్యాబ్‍లకు పంపి ఫలితాల కోసం ఎదురుచూస్తాం. అధికారులు మాపై కేకలు వేస్తారు.. మేము ల్యాబ్‍ అధికారులపై కేకలు వేయలేం కదా అంటున్నారు క్రింది స్థాయి ఉద్యోగులు. ఏ ఒక్కరికీ బాధ్యతలేదు. కరోనా పరీక్షలు ఈ విధంగా నిర్వహిస్తే ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అని పలువురు ఆందోళన చెందుతున్నారు. జిల్లా స్థాయి అధికారులకు సీరియస్‍ లేదు. రెవిన్యూ, డివిజన్‍ అధికారులు దృష్టి సారించరు. మునిసిపల్‍ మరియు మండల అధికారులు వాళ్ల స్థాయిలో పనులు చేసుకుంటూ పోతుంటారు. ఏదైనా కరోనా పరీక్షల నిర్వహణ ఒక పద్దతిలో కాకుండా రక రకాల పద్దతులలో చేస్తున్నారు. ఏ ఫలితాలు ఎప్పుడు వస్తాయో పరీక్షలకు పంపిన వారికి తెలీదు. పరీక్షలు చేయించుకున్న వారికి తెలియటం లేదని పలువురు కరోనా బాధితులు వాపోతున్నారు.


Comments