23.06.20 తాడేపల్లి, *వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ :* *108, 104లో అవినీతి ఎక్కడ చంద్రబాబూ? దమ్ముంటే చర్చకు రండి* *పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ. ప్రభుత్వానికి రూ.399 కోట్లు ఆదా* *బాబు హయాంలో ఏనాడైనా 108, 104 వాహనాలు తిరిగాయా?* *108 ఏర్పాటు చేసి లక్షలాది ప్రాణాలు వైయస్‌ఆర్‌ కాపాడారు* *జ్యుడిషియల్‌ ప్రివ్యూ తర్వాతే బిడ్లు పిలవటం జరిగింది* *108, 104 టెండర్లలో రూ.399 కోట్లు ఆదా* *టెండర్ రూ.100 కోట్లు దాటితో జ్యుడిషియల్ ప్రివ్యూకి* *1098 అత్యాధునిక వాహనాలు ప్రారంభించనున్న సీఎం గారు* *అవినీతిపై ఆధారాలుంటే చర్చకు రండి* *ఎన్నికల్లో బలముంటే బాబు సామాజిక వర్గానికి, లేకపోతే బలహీన వర్గాలా?* *ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత శ్రీ జగన్ గారిదే* *దేశంలో బెస్ట్‌ సీఎంల్లో శ్రీ జగన్ గారికి నాలుగో ర్యాంక్* - వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ 108, 104లో రూ.307 కోట్ల భారీ స్కాం జరిగిపోయిందని టీడీపీ, చంద్రబాబు ఎల్లో మీడియా, హడావుడి చేస్తోందని అసలు స్కాం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందని జోగి రమేష్‌ ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆపదలో ఉన్న పేదవాడికి, ప్రయాణ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణ సహాయం అందించటానికి 108 ఉండాలని మహానేత వైయస్‌ఆర్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 9 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఏనాడైనా 108 ద్వారా పేదలకు అండగా ఉండాలని, ప్రమాదం జరిగితే పేదవాడి ప్రాణం నిలబెట్టాలనే ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబు బుర్రకు తట్టిందా అని జోగి రమేశ్ ప్రశ్నించారు. మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 108 ప్రవేశపెట్టి పేదవారి ప్రాణాలకు కాపాడారని రమేష్‌ తెలిపారు. 108 ద్వారా కొన్ని వేల, లక్షల మందికి ప్రాణాలను మహానేత వైయస్‌ఆర్ కాపాడారన్నారు. చంద్రబాబు హయాంలో 108, 104 వాహనాలు రోడ్ల మీద కనపడ్డాయా అని జోగి రమేష్‌ నిలదీశారు. 108 వాహనం ఉంటే దాంట్లో డీజిల్ ఉండదు. వాహనం, డీజిల్‌ ఉంటే నడపటానికి పైలెట్ ఉండరు. ఇంత సిగ్గుమాలిన పరిపాలన చంద్రబాబు చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కొన్నివేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గ్రామాల్లో పేదలకు యాక్సిడెంట్‌ అయితే ఆసుపత్రి వెళ్లటానికి వసతులు లేక వేల మంది నిండు ప్రాణాలు పోయాయని రమేష్‌ గుర్తు చేశారు. *బాబు హయాంలో ఏనాడైనా 108, 104 వాహనాలు తిరిగాయా?* *108 ఏర్పాటు చేసి లక్షలాది ప్రాణాలు వైయస్‌ఆర్‌ కాపాడారు* 108, 104 గురించి చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్ మాట్లాడటమా? దాన్ని పచ్చ పత్రికలు రాస్తాయా? సిగ్గులేదా అని రమేష్‌ మండిపడ్డారు. 108 వాహనం అనేది చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కనపడలేదు. 108 వాహనాల ద్వారా అపర సంజీవనిలా లక్షలాది ప్రాణాలు వైయస్‌ఆర్‌ నిలబెట్టారు. 108 సకాలంలో నడపకుండా వేల మంది ప్రాణాలు గాల్లో కలిపేసిన చంద్రబాబు, టీడీపీ ఎల్లో గ్యాంగ్ ఈరోజు స్కాం జరిగిందనటంపై మండిపడ్డారు. ఏ అవినీతి జరిగింది. దమ్ముంటే చర్చకు రండని రమేష్ సవాల్ విసిరారు. టీడీపీకి నాయకులు కూడా కరువైపోయారు. తాడు, బొంగరం లేని వెధవల్ని కూడా మీడియా ముందుకు తీసుకువచ్చి పేపర్లు చూపించి విమర్శించటం ఏంటని రమేష్ అన్నారు. అసలు 108, 104 కొత్త వాహనాలను జులై 1న సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. దీంతో టీడీపీకి, చంద్రబాబుకు కడుపు మంట. ఈ వాహనాలు ప్రజల్లోకి వెళ్లి ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడితే సీఎం శ్రీ జగన్ గారికి మంచి పేరు వస్తుందని కడుపు మంటా అని రమేష్ నిలదీశారు. *జ్యుడిషియల్‌ ప్రివ్యూ తర్వాతే బిడ్లు పిలవటం జరిగింది* *108, 104 టెండర్లలో రూ.399 కోట్లు ఆదా* పేదవారి మేలు కోసం ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయకూడదా అని రమేష్ ప్రశ్నించారు. 108, 104 ప్రవేశపెట్టకూడదు. పేదలకు ఇళ్లు ఇవ్వకూడదు. అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి ఇవ్వకూడదు. రైతు భరోసా ఇవ్వకూడదన్నట్లు ప్రతిపక్షం వ్యవహరించటం సరికాదని రమేష్‌ హితవు పలికారు .ప్రతిదాంట్లోనూ స్కాం ఉందని మాట్లాడుతూ నీచంగా చంద్రబాబు దిగజారిపోతున్నారని రమేష్‌ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ప్రజలు క్షమించరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు పనికి వచ్చే 108, 104 మీద సమీక్షించి టెండర్లు ఆహ్వానించి జ్యుడిషియల్‌రివ్యూకు పంపించిన తర్వాత బిడ్లు పెట్టడం జరిగిందన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.399 కోట్లు ఆదా అయ్యాయని రమేష్‌ తెలిపారు. *టీడీపీకి నాయకత్వం ఉందా?* రాష్ట్రంలో టీడీపీకి నూకలు చెల్లిపోయాయి. టీడీపీకి అసలు నాయకత్వం ఉందా అని రమేష్ ప్రశ్నించారు. ఏదైనా చంద్రబాబు మాట్లాడాలి. లేకపోతే మాజీ మంత్రులు వచ్చి మాట్లాడాలి. అంతేకానీ దిక్కుమాలిన వారు వచ్చి మాట్లాడటం ఏంటని జోగి రమేష్ మండిపడ్డారు. తాడు, బొంగరం లేనివారు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద, సీఎం గారిపైన, శ్రీ విజయసాయిరెడ్డి గారిపైన నిందలు వేసే కార్యక్రమం ఏంటని టీడీపీ తీరుపై జోగి రమేష్‌ మండిపడ్డారు. చంద్రబాబుకు నిరూపించే దమ్ముంటే.. తేది, ప్రదేశం పెడితే.. మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా వస్తాం అని జోగి రమేష్ సవాల్ విసిరారు. టీడీపీ వాళ్లు దిక్కుమాలిన వారితో ప్రెస్‌మీట్లు పెట్టించి.. ఎల్లో పేపర్లలో వార్తలు రాయించి గగ్గోలు పెట్టించటం ఏంటని జోగి రమేష్ ప్రశ్నించారు. ఎవరో దిక్కుమాలిన వారితో ప్రెస్‌మీట్లు పెట్టిస్తే వాళ్ల ఇంటికి పోలీసులను పంపించామట. మాట్లాడే వారికి అడ్రస్ అయినా ఉండాలి కదా అని జోగి ఎద్దేవా చేశారు. ఇలాంటి సిగ్గుమాలిన మాటలు కట్టిపెట్టండని జోగి రమేష్ హితవు పలికారు. *టెండర్ రూ.100 కోట్లు దాటితో జ్యుడిషియల్ ప్రివ్యూకి* రూ.100 కోట్లు దాటితే ఏ టెండర్ అయినా జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్లాయని రమేష్ తెలిపారు. 108 సర్వీసెస్‌కి అరంబిందో ఫార్మా కన్సార్టియం, సర్వేశ్వం అనే రెండు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయన్నారు. అరబిందో కొత్త వాహనాలకు మూడు నెలల కాలానికి రూ.6,12,222 టెండర్ వేస్తే ప్రభుత్వం రూ.5,34,214లకు ఇవ్వటం జరిగింది. అంటే నెలకు రూ.1,78,072లు నిర్వహణ ఖర్చు అవుతోందన్నారు. పాత వాహనాలకు మూడు నెలలకు రూ.6,63,772 ప్రభుత్వం ఇచ్చింది. అంటే నెలకు రూ.2,21,257లు అవుతోందన్నారు. పాతవాహనాల మెయింటైన్ ఖర్చు ఎక్కువ అవుతుందని జోగి రమేష్‌ వివరించారు. *పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ* *1098 అత్యాధునిక వాహనాలు ప్రారంభించనున్న సీఎం గారు* *అవినీతిపై ఆధారాలుంటే చర్చకు రండి* 104 నిర్వహణ నిమిత్తం పిరమిల్‌, అరబిందో బిడ్లు దాఖలు చేస్తే.. పిరమల్‌ వెనక్కి వెళ్లిపోయిందని రమేష్‌ తెలిపారు. అరబిందోకి 676 వాహనాల నిర్వహణకు ఇవ్వటం జరిగింది. ఒక్కో వాహనానికి రూ.1,80,225 ఖర్చు అవుతుందని రమేష్ తెలిపారు. అదే చంద్రబాబు హయాంలో బీవీజీ అనే సంస్థకు ఒక్కో వాహనానికి రూ.1.37 లక్షలు ఇస్తే 108, 104 వాహనాలు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించాయా? మార్కెట్ యార్డుల్లో పడేశారు. ఎప్పుడు ఫోన్ చేసినా షెడ్లకు వెళ్లాయని అని చెప్పేవారని జోగి రమేష్ మండిపడ్డారు. 108, 104 సర్వీస్‌ల కోసం జులై 1న 1098 అత్యాధునిక వాహనాలు సిద్ధం చేశారని వాటిలో వెంటిలేటర్‌తో సహా ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారన్నారు. వాటిని సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని రమేష్‌ తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, జాతీయ రహదారిపై ప్రమాదం వారిని వెంటనే ఆసుపత్రికి చేర్చేలా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి గారిని అభినందించకుండా రాళ్లు వేసే కార్యక్రమం చేయటం సిగ్గుచేటన్నారు. మీ దగ్గరున్న ఆధారాలతో రండని.. మా వద్ద ఆధారాలు చూపించి మీడియా సమక్షంలో తేల్చుకుందామని జోగి రమేష్‌ సవాల్ విసిరారు. *ప్రెస్‌మీట్లు పెట్టి పత్రికల్లో రాయించి కల్లబొల్లి కబుర్లొద్దు* *రాజ్యసభ ఎన్నికలతో టీడీపీ స్థాయి ఏంటో తేలిపోయింది* *రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్యను బలిపశువు చేశారు* *ఎన్నికల్లో బలముంటే బాబు సామాజిక వర్గానికి, లేకపోతే బలహీన వర్గాలా?* పత్రికల్లో వార్తలు రాయించి అదే నిజమని కల్లబొల్లి కబుర్లు చెప్పే టీడీపీని ఓట్ల రూపంలో ప్రజలు చీల్చిచెండారని రమేష్ మండిపడ్డారు. టీడీపీ రాష్ట్రంలో చనిపోయిందని రమేష్‌ అన్నారు. ఇప్పుడు చంద్రబాబును ప్రజలెవ్వరూ నమ్మరని అన్నారు. మొన్న రాజ్యసభ సాక్షిగా 23 స్థానాలు ఉంటే.. 17 ఓట్లు వాళ్లకు వచ్చాయి. 6 ఓట్లు రాలేదు. చంద్రబాబు మీద వాళ్ల ఎమ్మెల్యేలే తిరుగుబాటు బావుటా ఎగరవేశారన్నారు. అచ్చెన్నాయుడు ఆసుపత్రిలో ఉంటే.. మరో ఇద్దరు ఎందుకు రాలేదు. 21 ఓట్లు వస్తాయనుకుంటే.. 17 స్థానాలకు టీడీపీ దిగజారిపోయింది. రాజమండ్రి ఎమ్మెల్యే భవానీ చదువుకొంది. కావాలని టీడీపీకి ఓటేయలేదని జోగి రమేష్‌ అన్నారు. అచ్చెన్నాయుడుకు ఏమో కేసులు. చంద్రబాబు వాళ్ల అబ్బాయికి ఏమో సూట్‌ కేసులు అని రమేష్ తెలిపారు. అందుకే చంద్రబాబుకు భవానీ ఓటేయలేదని రమేష్ అన్నారు. బీసీలను చంద్రబాబు దోచుకొని దాచుకున్నారు. అనగాని సత్యప్రసాద్‌కు కూడా చంద్రబాబుపై నమ్మకం పోయింది. రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్యను బలిపశువు చేశారు. గతంలోనూ వారధి దాకా వచ్చి వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇవ్వటం లేదని చెప్పారు. మా సామాజిక వర్గానికి చెందిన కనకమేడల రవీంద్రకుమార్‌కు ఇచ్చామని చంద్రబాబు అన్నారు. పాపం ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి మోసపోయారు. గెలవలేని పరిస్థితుల్లో ఎస్సీ కులానికి చెందిన వర్ల రామయ్యను బలిపశువు చేశారని జోగి రమేష్‌ మండిపడ్డారు. *ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత శ్రీ జగన్ గారిదే* *ఏడాదిలో దేశంలో బెస్ట్‌ సీఎంల్లో నాలుగో ర్యాంక్ శ్రీ జగన్ గారికి వచ్చింది* బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు నాయకులను రాజ్యసభకు శ్రీ జగన్ గారు పంపించారు. అధికారం, ఎమ్మెల్యేల బలం ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యుల్ని మీ వాళ్లను చేసుకుంటావు. బలం లేనప్పుడు బలహీన వర్గాలను బలిపశువు చంద్రబాబు చేస్తున్నారన్న విషయం అందరూ గ్రహించారని జోగి రమేష్ తెలిపారు. నారా చంద్రబాబు వెంట బీసీలు లేరు, ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు, మైనార్టీలు లేరని రమేష్‌ తెలిపారు. ఎప్పుడో చంద్రబాబు నాయకత్వంపైన ఆయా వర్గాల్లో నమ్మకం పోయిందన్నారు. టీడీపీ దుకాణం బంద్ అని అన్ని వర్గాల ప్రజలు చెప్పేశారు. శ్రీ జగన్ గారికి అన్ని వర్గాల ప్రజలు జేజేలు పలుకుతున్నారు. కేవలం ఒక్క ఏడాది పాలనలో దేశంలో ముఖ్యమంత్రుల్లో శ్రీ జగన్‌ గారికి నాలుగో స్థానం వచ్చిందని రాబోయే రోజుల్లో నెంబర్ వన్‌ స్థానానికి రాబోతున్నారని జోగి అన్నారు.


Comments