మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు ప్రభుత్వం వరం.

          
*• మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు ప్రభుత్వం వరం

*
*• అబియన్స్ లో మూడేళ్ల కాలపరిమితి జీవో* 
*• పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మెప్మా ఆర్పీలు* 
*• ప్రభుత్వ నిర్ణయంతో ఆర్పీల్లో ఆనందోత్సాహాలు*

    
   విజయవాడ (ప్రజా అమరావతి );


           పేదలు, నిరుపేదల ఆదాయాన్ని డబుల్ చేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పమని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్ట్రవ్యాప్త రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) సీఆర్డీఏ ఆఫీసు వద్ద  మంత్రి పొంగూరు నారాయణను గురువారం రాత్రి మెమో అబియెన్స్ చేయడంపై కలిసి తమ సంతోసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో గల మెప్మా రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీ) ఆదాయం ఎంతో మెరుగ్గా ఉందన్నారు. ఆర్పీల ఆదాయం రెట్టింపు అయ్యేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అంతేకాకుండా వారు వ్యాపార వేత్తలుగా ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందుకే ప్రభుత్వం ఇసుక రీచ్ లను కూడా వారికి అందించిందన్నారు. సాంకేతిక ఇబ్బందులు వల్ల కొద్ది రోజులే అమలు చేయగలిగామన్నారు. గత ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా వీరిని ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఆర్పీలు ఎవరైనా మూడేళ్ల వరకే పనిచేయాలనే గత ప్రభుత్వం విధించిన అత్యంత ప్రమాదకరమైన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం అబియెన్స్ లో పెట్టిందన్నారు. ఈ మేరకు  ప్రభుత్వం మూడేళ్ల కాలపరిమితి ఉత్తర్వులను అబియెన్స్ (Abeyance) లో పెడుతూ పట్టణాభివృద్ధి శాఖ మెమో ను జారీ చేసిందన్నారు.. ఇప్పటి వరకూ పని భద్రత లేదన్న భయంతో గడిపిన ఆర్పీలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ఆనందోత్సాహాలకు గురయ్యారన్నారు. ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పట్టణాల్లో ఉన్న పొదుపు సంఘాల్లో మహిళల ఆర్థికాభివృద్ధిలో మెరుగైన పనితీరు, ఫలితాలు చూపిస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు.  

           శాసనసభ్యులు మరియు పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్పీలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఆర్పీల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఆర్పీలు మూడు సంవత్సరాల వరకే చేయాలన్న నిబంధన పెట్టి ఇబ్బందులు పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం ఆ ఉత్తర్వులను అబియన్స్ (Abeyance) చేసి వారి జీవితాలకు భరోసా కల్పించిందన్నారు.

          కార్యక్రమంలో మెప్మా ఎమ్ డి శ్రీ తేజ్ భరత్, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సంపత్, ఆర్పీ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, తదితరలు ఉన్నారు. 



Comments