అన్నదాత సుఖీభవ - పీయం కిసాన్ పథకం.
రైతు సేవా కేంద్రములకు చేరిన అర్హుల జాబితా.
- డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు
అమరావతి (ప్రజా అమరావతి);
డిల్లీ రావు మీడియా ప్రకటన చేస్తూ *అన్నదాత సుఖీభవ పథకం* లోని అర్హులైన రైతుల జాబితాలను సంబంధిత *రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో* ఉంచడం జరిగిందని కాబట్టి రైతులు తమ అర్హతను నిర్ధారించుకోవడానికి రైతు సేవా కేంద్రంలో ఉన్న జాబితాలో వారి పేర్లును పరిశీలించుకోవచ్చు అని తెలిపారు .ప్రింట్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది అని అర్హత ఉన్న వారు కేంద్రాలనుండి ప్రింట్ కాపీలను పొందవచ్చు అని తెలిపారు.
రైతు సేవా కేంద్రాలను ప్రత్యక్షముగా సందర్శించే రైతులు *అన్నదాత సుఖీభవ పోర్టల్ లో* ఆధార్ నెంబర్ ద్వారా *Know Your Status* లో తన అర్హతను తెలుసుకోవచ్చు అని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో పారదర్శకమైన సులభతరమైన సేవలను ప్రజలకు అందించే పాలనాపర సంస్కరణలో బాగంగా ప్రవేశ పెట్టిన *మన మిత్ర* వాట్సాప్ ద్వారా
రైతులకు వారి అర్హతను తెలుసుకునే మరొక సదుపాయం కూడా వ్యవసాయ శాఖ కల్పించడం జరిగిందని తెలిపారు . వారి ఆధార్ నెంబర్‌ను *మన మిత్ర* వాట్సాప్ నంబరు 9552300009 కు పంపితే, వాట్సాప్ ద్వారా అర్హత వివరాలు తెలుసుకోవచ్చు అన్నారు
అర్హుల జాబితాలో రైతు పేరు లేని పక్షములో , తాను అర్హుడినని భావిస్తే, సంబంధిత రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించి అన్నదాత సుఖీభవ పోర్టల్ లోనీ *గ్రీవెన్స్ మాడ్యులు లో* నమోదు చేసుకోవచ్చు అని తెలుపుతూ ఈ అవకాశం *జూలై 13 వరకు మాత్రమే* అందుబాటులో ఉంటుంది అని డిల్లీ రావు తెలిపారు .ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మేరకు అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం లోని ఆర్థిక సహాయం అందాలని , ఏ ఒక్క రైతు మిగిలిపోకుండా చూడాలన్నారు .
ఈ గ్రీవెన్స్ పరిష్కార మాడ్యూల్ ద్వారా నమోదు అవకాశ విషయాన్ని రైతులకు మరింత చేరేలా సరైన ముమ్మర ప్రచారం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు
addComments
Post a Comment