అమరావతి.(ప్రజాఅమరావతి):జూన్,24; *ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధికి రోల్ మోడల్ గా నిలుపుతాం : పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్యం, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* * సంస్కరణలతోనే సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం * ఇప్పటివరకూ ఎలా ఉన్నా ఇకపై సకలమూ సక్రమంగానే * పారదర్శకత, జవాబుదారీ విధానాలతో చేసే ప్రతీది ప్రజల ముందుపెడతాం * ఐఎస్ బీ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలలో సమకాలీక వృద్ధి * ప్రభుత్వాలు మారినా చెక్కుచెదరని విధానాలను రూపొందిస్తాం * శాఖలలో పునర్ వ్యవస్థీకరణే లక్ష్యం * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి 'ఐఎస్ బీ' సుముఖం * 'ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్' తోడ్పాడుతో డిజిటల్, టెక్నాలజీ, ఉద్యోగ కల్పనలో సరికొత్త మార్పులు * హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న 'ఐఎస్ బీ'ని సందర్శించిన మంత్రి గౌతమ్ రెడ్డి * రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, పటిష్టత కోసం ఐఎస్ బీతో 'అడ్వైజరీ కౌన్సిల్' ఏర్పాటు * పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటులోనూ తోడ్పాటు * శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు,నిపుణులు, ప్రొఫెసర్లకు అడ్వైజరీ కమిటీలో భాగస్వామ్యం * ప్రతి 15 రోజులకు ఒకసారి ఎప్పటికప్పుడు సమీక్ష * వచ్చే వారంలో మరోసారి 'ఐఎస్ బీ' తో సమావేశమయ్యే అవకాశం * పరిపాలన సజావుగా, సులువుగా సాగే వ్యవస్థ దిశగా అడుగులు * సమయాభావం, వ్యయ,ప్రయాసలకు ఆస్కారంలేని విధంగా నిర్మాణాత్మక సంస్కరణలు * ముందస్తుగా ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖలతో ప్రక్షాళన ప్రారంభం * దశలవారీగా ప్రభుత్వంలోని అన్ని శాఖలలో ఇదే తరహా చర్యలు * నైపుణ్యాణికి తగ్గ ఉద్యోగాల కల్పన, శిక్షణలో ఐఎస్ బీ పూర్తి సహకారం * ప్రభుత్వపాలనను కొత్త పుంతలు తొక్కించే నిర్ణయాలతో నిరంతర అభివృద్ధి * సమగ్రాభివృద్ధి సాధనకు అవసరమైన నిర్దిష్ట ప్రణాళిక, విధివిధానాలను సృష్టిస్తాం * ప్రభుత్వ పాలనకు కీలకమైన నాణ్యత, నిర్వహణలో రాజీపడం * స్కిల్ కళాశాలలు, శిక్షణ సహా ప్రతి అంశంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక ముద్ర * గణాంకాలతో సహా శాఖలలో జరిగే ప్రతి పనిని పారదర్శకంగా ప్రజల ముందుంచుతాం * అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటాం * నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖతో ఐఎస్ బీ విద్యార్థులు అనుసంధానమై అప్రెంటిషిప్ * ఒకే భావ స్వారూప్యం కలిగిన విభాగాలన్ని ఒకే గొడుకు కిందకు * క్రమశిక్షణ, ప్రణాళిక, పారదర్శక విధానాలతో అభివృద్ధి దిశగా ముందడుగు * తమ సలహా మండలిలో శాశ్వత సభ్యునిగా ఉండాలని మంత్రి మేకపాటిని విజ్ఞప్తి చేసిన 'ఐఎస్ బీ' * సమస్యల పరిష్కారం, వ్యవస్థల నిర్మాణానికి పదవులెందుకని చిరునవ్వుతో మంత్రి సమాధానం *బుధవారం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన 'ఐఎస్ బీ' భాగస్వామ్య సమావేశంలో పాల్గొన్న ఐఎస్ బీ సంస్థకు చెందిన ఫినాన్స్ , డిజిటల్ ఐడెంటెటీ, రీసెర్చ్ ఇన్షియేటివ్(DIRI) విభాగం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి,ఓబీ, స్ట్రాటెజిక్ హ్యూమన్ కాపిటల్ విభాగానికి చెందిన క్లినికల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ శ్రీపాద, పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ అశ్విని ఛాట్రే, ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, అసోసియేట్ డైరెక్టర్ సందీప్ జమ్మలమడ, తదితరులు.
Popular posts
కష్టంలో అండగా...
• GUDIBANDI SUDHAKAR REDDY

మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు ప్రభుత్వం వరం.
• GUDIBANDI SUDHAKAR REDDY

కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈఎల్ఐ పథకం ద్వారా విస్తృత ప్రయోజనాలు: ప్రాంతీయ పి ఎఫ్ కమిషనర్ అబ్దుల్ ఖాదర్
• GUDIBANDI SUDHAKAR REDDY
వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వివరాలు అందించాలి.
• GUDIBANDI SUDHAKAR REDDY

Government to Launch ‘NAVYA’ – A Joint Pilot Initiative for Skilling Adolescent Girls Under Viksit Bharat@2047 Vision tomorrow.
• GUDIBANDI SUDHAKAR REDDY
Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment