*చేనేత‌ల గుండెల్లో జ‌గ‌న‌న్న‌* *నేత కార్మికుల‌కు స‌రిప‌డా సాయం అందిస్తున్నాం* *ఏటా రూ.24వేలు ఇస్తున్న ప్ర‌భుత్వం మాదే* *అర్హులంద‌రికీ ల‌బ్ధి చేకూర్చ‌డమే ధ్యేయం* *చిల‌క‌లూరిపేట (ప్రజాఅమరావతి); నియోజ‌క‌వ‌ర్గంలో 212 మందికి ల‌బ్ధి* *చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు* *నేత‌న్న నేస్తం ప‌థ‌కం ప్రారంభం సంద‌ర్భంగా చేనేత‌ల ఇళ్ల‌కు వెళ్లి ప‌థ‌కం విశిష్టత‌ను తెలిపిన ఎమ్మెల్యే గారు* చేనేత‌ల గుండెల్లో జ‌గ‌న‌న్న ఎప్ప‌టికీ నిలిచిపోతార‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. నేత‌న్న నేస్తం ప‌థ‌కంలో భాగంగా శ‌నివారం రాష్ట్రంలోని చేనేత‌లంద‌రికీ ప్ర‌భుత్వం రూ.24వేలు ఆర్థిక సాయం అందజేసిన విష‌యం తెలిసిందే. ప‌థ‌కం గొప్ప‌ద‌నాన్ని వివ‌రిస్తూ ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారు శ‌నివారం నేరుగా ల‌బ్ధిదారుల ఇళ్ల‌కే వెళ్లారు. కొద్దిసేపు మ‌గ్గం వ‌డికారు. నేత నేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ‌తేడాది డిసెంబ‌ర్ ఒక‌టో తేదీన స్వ‌యంగా త‌న పుట్టిన రోజు నాడు సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారి నేత‌న్న నేస్తం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి చేనేత‌ల‌పై త‌న‌కు ఉన్న ప్ర‌త్యేక‌మైన ప్రేమ, అభిమానాల‌ను చాటుకున్నార‌ని తెలిపారు. ఈ ఏడాది ఆరు నెల‌లు ముందుగానే.. అంటే డిసెంబ‌ర్‌లో అమ‌లు చేయాల్సిన ప‌థ‌కాన్ని జూన్ నెల‌లోనే అమ‌లు చేశామ‌ని తెలిపారు. ప్ర‌తి చేనేత కుటుంబానికి ఏటా రూ.24వేలు ఆర్థిక సాయం అంద‌జేయ‌డం ఎంతో అద్భుత‌మైన విష‌య‌మ‌ని చెప్పారు. క‌రోనా నేప‌థ్యంలో చేనేత కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయ‌ని గ్ర‌హించి.. ఆరు నెల‌లు ముందుగానే తిరిగి రెండో విడ‌త ఆర్థిక సాయం అంద‌జేశామ‌న్నారు. *నియోజ‌క‌వ‌ర్గంలో రూ.50.88 ల‌క్షల ఆర్థిక సాయం* చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 212 మంది చేనేతల‌కు ఆర్థిక సాయం అంద‌జేసిన‌ట్లు చెప్పారు. ఆర్థిక సాయం పొందిన ల‌బ్ధిదారుల సంఖ్య‌లో జిల్లాలో నాలుగోస్థానంలో ఉన్న‌ట్లు చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం మీద రూ.50.88 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అంద‌జేశామ‌ని తెలిపారు. ఉద‌యానికే ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో న‌గ‌దు జ‌మ అయింద‌న్నారు. ప‌ట్ట‌ణంలోని భావ‌నారుషిన‌గ‌ర్‌లోని చేనేత‌ల ఇళ్ల‌కు ఎమ్మెల్యే గారు వెళ్లి నేత‌న్న నేస్తం ప‌థ‌కం విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. కార్య‌క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు బిట్రా రాజేంద్రప్రసాద్,ర‌త్నారెడ్డి,తోట బ్రహ్మస్వాములు,బిట్రా నాగంజనేయులు, అవ్వారు రవికుమార్,అవ్వారు అన్నపసెట్టి,ఊట్ల సాంబమూర్తి,దుర్గా నాయక్,జి.వెంకటేశ్వర్లు,పగడ రామకోటేశ్వరరావు,కస్నా నాయక్,గోలి వెంకటేశ్వర్లు త‌దిత‌రులు ఉన్నారు.


Comments