*నిడమర్రు గ్రామంలో సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆర్కే గారు... మంగళగిరి (ప్రజాఅమరావతి);జూన్;24: మండలం, నిడమర్రు గ్రామంలో ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ను ఎమ్మెల్యే ఆర్కే గారు, AP ట్రాన్స్ కో. CMD గార్లు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 6 కోట్ల రూపాయలతో సబ్ స్టేషన్ నిర్మాణం 3 లేదా 4 నెలలో పూర్తి టెక్నాలజీ తో నిర్మాణం జరుగుతుందని, నిడమర్రు, కురగల్లు, బేతపూడి, నీరుకొండా, చిన్న కాకాని గ్రామాలకు వ్యవసాయ మరియు గ్రామాలలో ఇంటి అవసరాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్తు అందించటానికి ఈ సబ్ స్టేషన్ ఉపయోగ పడుతుందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Y.S. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పగటిపూట 9 గంటల నిరంతరాయంగా కరెంట్ అందించటానికి కృషి చేస్తున్నారని తద్వారా రైతులు వ్యవసాయం చేయటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో AP ట్రాన్స్ కో CMD గారు, EE విజయ్ గారు, తదితర విద్యుత్ శాఖ అధికారులు, MPDO గారు, రురల్ CI శేషగిరి రావు గారు, SI శ్రీనివాసరెడ్డి గారు, పంచాయతీ అధికారులు, YSRCP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...


Comments