*వేడుక‌ల‌కు దూరంగా ఉందాం.. బాధ్య‌త‌ను చాటుకుందాం* చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ‌స‌భ్యుల‌కు నా న‌మ‌స్కారాలు. క‌రోనా వైర‌స్ వెంటాడుతున్న క‌ష్ట‌కాలం ఇది. మ‌న క‌ళ్ల ముందే ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోకుతోంది. వేలాదిమంది చ‌నిపోతున్నారు. స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ పాటించ‌డ‌మే ఇప్ప‌టి ఈ క‌ష్ట‌కాలానికి మందు. రేపు (జూన్ 24, బుధ‌వారం) పుట్టిన రోజనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. మ‌న చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కుటుంబ‌స‌భ్యులంతా వారి నాయ‌కురాలిగా నాకు రేపు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పాలని ఆశించ‌డం అత్యంత స‌హ‌జం. ఇందుకోసం మ‌న కార్యాల‌యానికి రావాల‌ని, శుభాకాంక్ష‌లు చెప్పాల‌ని అంద‌రికీ ఉంటుంది. మీకు- నాకు మ‌ధ్య ఉన్న అవినాభావ సంబంధానికి, ఆత్మీయ‌త‌కు ప్ర‌తీక ఇది. అయితే ఇక్క‌డ ఒక విష‌యం చెప్పాలి. మ‌న‌మంతా క‌లిసి వేడుక‌లు జరుపుకునే స‌మ‌యం ఇది కాద‌నేది నా అభిప్రాయం. ఈ విష‌యం మీ అంద‌రికీ కూడా తెలుసు. ఒక‌ప‌క్క కోవిడ్ మ‌హ‌మ్మారి‌, మ‌రోవైపు మ‌న దేశ స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక‌త్త‌, జ‌వాన్ల మ‌ర‌ణం.. ఈ విప‌త్తులు మ‌నం చూస్తునే ఉన్నాం. కాబ‌ట్టి ఇప్పుడు మ‌న‌కు స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ ఎంతో అవ‌స‌రం. అందుకే నేను పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అవును ఈ ఏడాది వ‌ర‌కు మ‌న‌కు ఎలాంటి వేడుక‌లూ వ‌ద్దు. లేనిపోని స‌మ‌స్య‌ల‌కు మ‌నం ఎప్ప‌టికీ కార‌ణం కాకూడ‌దు. ద‌య‌చేసి రేపు ఎవ‌రూ నాకు శుభాకాంక్ష‌లు చెప్పేందుకు రావ‌ద్దు. నా మంచిని, అభివృద్ధిని మీరంతా నిరంత‌రం కోరుకుంటూనే ఉంటారు. మీరంతా నాపై ప్రేమాభిమానాల‌ను ఎప్ప‌టికీ చూపిస్తూనే ఉంటారు. నాపై మీకు ఉన్న అనంత‌మైన అభిమానానికి నా విజ‌య‌మే నిద‌ర్శ‌నం. ఇంత‌కుమించి ఏవైనా రుజువులు ఇంకా ఉంటాయా..? ఈ ఒక్క ఏడాదికి మ‌నం పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉందాం. నా ఈ నిర్ణ‌యం ఎవ‌రికైనా ఇబ్బందిగా అనిపిస్తే ద‌య‌చేసి క్ష‌మించండి. రేపు ఎవ‌రూ చిల‌క‌లూరిపేట‌లోని మ‌న కార్యాల‌యానికి రావాల్సిన అవ‌స‌రం లేదు. మ‌నం ఎలాంటి వేడుక‌లూ జ‌రుపుకోవ‌డంలేదు. నాకు శుభ‌కాంక్ష‌లు చెప్ప‌డానికి సోష‌ల్‌మీడియా ఉంది. వాట్సాప్‌, మెసెజ్‌ల ద్వారానూ శుభాకాంక్ష‌లు అంద‌జేయొచ్చు. బాధ్య‌త క‌లిగిన ప్ర‌జాప్ర‌తినిధిగా పుట్టిన రోజుకు సంబంధించి రేపు ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేయ‌డంలేదు. ఎక్క‌డికి రావ‌డంలేదు. నాకు తెలుసు మీరంతా అర్థం చేసుకుంటారు. నా ఈ నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు ఇస్తార‌ని, పెద్ద మ‌న‌సు చేసుకుని అర్థం చేసుకుంటార‌ని ఆశిస్తూ... - *మీ* *విడ‌ద‌ల ర‌జిని* *ఎమ్మెల్యే చిలకలూరిపేట*


Comments