*ఆప‌ద‌లో ఆదుకునేవాళ్లు దేవుళ్లే* *సాయం చేసేవారికి ఎప్పుడూ అండ‌గా ఉంటా* *చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు* *ప్ర‌శాంతి వృద్ధాశ్ర‌మంలో వృద్ధులు, పిల్ల‌ల‌కు దుస్తులు పంపిణీ* ఆప‌ద‌లో ఆదుకునేవాళ్లు దేవుళ్ల‌తో స‌మాన‌మ‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. స్థానిక ప్ర‌శాంతి వృద్ధాశ్ర‌మంలో మంగ‌ళ‌వారం ఎమ్మెల్యే గారు 25 మంది వృద్ధులు, 50 మంది చిన్నారుల‌కు దుస్తులు పంపిణీచేశారు. ఈ నెల 24వ తేదీన ఎమ్మెల్యే గారు జ‌న్మ‌దిన సంద‌ర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ప‌ఠాన్ త‌ల్హాఖాన్ ఆధ్వ‌ర్యంలో ప‌ట్ట‌ణంలోని బాపూజీ, ప్ర‌శాంతి వృద్ధాశ్ర‌మాల్లో గ‌త 11 రోజుల నుంచి ఉచితంగా అన్న‌దానం చేస్తున్న‌విష‌యంలో తెలిసిందే. తల్హాఖాన్ ఆధ్వ‌ర్యంలోనే మంగ‌ళ‌వారం దుస్తుల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌ర‌గింది. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సాయం చేసేవారికి తాను ఎప్పుడూ అండ‌గా ఉంటాన‌ని తెలిపారు. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు చేసిన సాయం త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇచ్చింద‌ని వెల్ల‌డించారు. అద్భుత‌మైన ప్ర‌భుత్వంలో తాను భాగ‌స్వామిగా ఉండ‌టం త‌న అదృష్ట‌మ‌ని చెప్పారు. సంక్షేమం కోసం ఎన్నో అద్భుత కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న ఘ‌న‌త త‌మ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారికే ద‌క్కుతుంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.


Comments