శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: ఈరోజు అనగా ది.26-06-2020 న గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనరు శ్రీ పి.అర్జున రావు, ఐఏఎస్ గారు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం యందు జరుగుచున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. గౌరవనీయులైన ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు, శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు మరియు ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీ డి.వి.భాస్కర్ గారు ఆలయము నందు జరుగుచున్న అభివృద్ధి పనుల గురించి దేవాదాయ శాఖ కమీషనరు గారికి వివరించారు. ఈ కార్యక్రమము నందు ఆలయ ఉప కార్యనిర్వాహక ఇంజినీరు వార్లు, సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు వార్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


Comments