*నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో వై.యస్.ఆర్.కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.* *వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద 291 మంది లబ్ధిదారులకు అందజేయనున్న 43 లక్షల 65వేల రూపాయల చెక్కును ప్రదర్శించిన ఎమ్మెల్యే కాకాణి.* *నూతనంగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.* *టి.పి.గూడూరు మండలం, వరిగొండ గ్రామంలో ₹10,000/-ల ఆర్ధిక సహాయం అందుకున్న దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులు వై.యస్.ఆర్.విగ్రహానికి నివాళులర్పించి, ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకాణి.* *స్క్రోలింగ్ పాయింట్స్:* జగన్ మోహన్ రెడ్డి గారు 45 నుండి 60 సంవత్సరాల లోపు మహిళలకు ₹15,000/-ల చొప్పున *"వై.యస్.ఆర్.కాపు నేస్తం"* పధకం కింద ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎందరో ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించినా... సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు తీయించిన ఘనత మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారిది. రాష్ట్ర ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం ప్రభుత్వంలో "పేదరికంపై గెలుపు" అంటూ మాటలతో సరిపెట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు పేదరికాన్ని గెలిచేందుకు వారి మార్గాన్ని సుగమం చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి గారిది ఆదరణ పథకం పేరుతో టిడిపి నాయకులు దోచుకున్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల గురించి ఆలోచన చేసి చెప్పిన దానికన్న మిన్నగా అందజేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో అర్హత కలిగిన ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదు. అర్హతే ప్రామాణికంగా అందుతున్న సంక్షేమ పథకాలే తిరిగి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి పాలన ప్రారంభమైంది అనడానికి సంకేతం. చంద్రబాబు ప్రజలకు జరుగుతున్న మంచిని చూడలేక భవనాలకు వేసిన రంగుల గురించి రాదాంతం చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలులో అర్హులకు అన్యాయం చేయడం, గ్రామాలలో చిచ్చుపెట్టడం తప్ప అభివృద్ధి జాడ కనిపించలేదు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సర్వేపల్లి నియోజకవర్గంలో 800 కోట్లతో ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము. నన్ను ఆశీర్వదించి, ఆదరించిన మీకు ఇంటి బిడ్డలా సేవలందిస్తా.


Comments