*బియ్యం బస్తాల్లో-మద్యం బాటిళ్లు* *నూతన పద్ధతుల్లో అక్రమ మద్య రవాణాకు తెగబడుతున్న మద్యం రాయుళ్లు* _బియ్యం బస్తాల్లో 371 మద్యం సీసాలు _తెలంగాణ నుండి గుంటూరు జిల్లా నూకలపేటకు మద్యం బాటిళ్లు తరలిస్తూ దబ్బాకు పల్లి వద్ద పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు_ _ఇద్దరు వ్యక్తులు అరెస్ట్, రెండు ద్విచక్ర వాహనాల సీజ్_ *జిల్లా SP శ్రీ రవీంద్రనాథ్ IPS., గారు అక్రమ మద్యం రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపాలన్న ఆదేశాల మేరకు* *జిల్లాలోని పోలీసు సిబ్బంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ మద్యం రవాణా దారుల తాట తీస్తున్నారు* *కళ్లుకప్పి తప్పించుకు పోవచ్చులే అన్న పందాతో , అక్రమ లాభర్జనే ధ్యేయంగా తెగబడుతున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు క్రిష్ణా జిల్లా పోలీసులు* *పోలీసులు పసిగట్టలేరులే అన్న ఆలోచనతో మద్యం రవాణా దారులు వాటర్ క్యాన్లలో, ఉల్లిపాయల సంచుల్లో, అంబులెన్స్, పశువుల గడ్డి మోపులో ఇలా అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పోలీసులకు చిక్కిన సంఘటనలు చాలానే ఉన్నాయి* *ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున నందిగామ సాండ్ మొబైల్ సిబ్బంది-03 వత్సవాయి మండలం లోని దబ్బాకుపల్లి డొంక రోడ్డు వద్ద కాపు కాశారు* *గుంటూరు నూకల పేట, అందుకూరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై బియ్యం బస్తాలతో తెలంగాణ నుండి గుంటూరు జిల్లా వెళ్లే క్రమంలో* *పోలీసు సిబ్బంది బియ్యం బస్తాలు పై అనుమానం వచ్చి వాటిని తనిఖీ చేయగా,రెండు బియ్యం బస్తాలు ఒక బ్యాగ్ లో మొత్తం 371 మద్యం బాటిల్ గుర్తించిన పోలీసులు* *మద్యం బాటిళ్లను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, 80 కేజీల బియ్యం, రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు* *ఈ వాహన తనిఖీ లో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ సుధాకర్, గోపి, వెంకటేష్ లను నందిగామ డిఎస్పి రమణ మూర్తి గారు అభినందించారు*
Popular posts
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.
• GUDIBANDI SUDHAKAR REDDY
Year End Review 2024; Ministry of Road Transport and Highways.
• GUDIBANDI SUDHAKAR REDDY
పశు గణన భవిష్యత్ ప్రణాళిక మరియు విధాన రూపకల్పనకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది.
• GUDIBANDI SUDHAKAR REDDY
Three Action Plan teams formed for Semiconductor; Critical Minerals with a focus on batteries; and Chemicals to facilitate supply chain resilience.
• GUDIBANDI SUDHAKAR REDDY
Computing and technological development is a core building block for India to become a developed country by 2047: Shri Ashwini Vaishnaw.
• GUDIBANDI SUDHAKAR REDDY
Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment