*ఎన్టీఆర్‌, చంద్రన్న, వైఎస్సార్‌, జగనన్న.. వీరేనా మహానాయకులు?: జీవీఎల్‌* విజయవాడ: ఏపీకి రాజకీయంగా 4 గ్రహణాలు పట్టాయని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌, చంద్రన్న, వైఎస్సార్‌, జగనన్న.. వీరేనా మహానాయకులు? అని ప్రశ్నించారు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన ప్రకాశం, వీరేశలింగం కనిపించరా అని నిలదీశారు. కుటుంబ రాజకీయాల కోసం ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడతారా? అని మరోసారి ప్రశ్నించారు. రెండు ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదని తప్పుబట్టారు. ఇసుక మాఫియా పేరుతో దోచుకుంటున్నారని, అవినీతి నిర్మూలన అనేది రాజకీయ కోణంలోనే వాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కుల పోరాటాలు తప్ప ప్రజల భాగస్వామ్యం ఉండటం లేదని జీవీఎల్‌ నరసింహరావు ఆక్షేపించారు.


Comments