రికార్డుల నిర్వాహణ సక్రమంగా జరగాలి. డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ కొవ్వూరు : గ్రామ సచివాలయం రికార్డులు సక్రమంగా నిర్వహచాలని జిల్లా పంచాయతీ అదికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. వాడపల్లి గ్రామ సచివాలయం సంధర్శించి నూతన భవన నిర్మాణం ప్రగతిని సమీక్షించారు. జిల్లాలో 938 గ్రామ సచివాలయాలకు గాను 918 కొత్త భవనాలు అవసరం కాగా 900 భవనాలకు పరిపాలన ఆమోదంపొంది వివిద నిర్మాణ దశలలో ఉన్నాయని అన్నారు. గ్రామ సచివాలయాలలో తప్పని సరిగా సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితా ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. అలాగే పథకాల అర్హత నియమావళి, సంక్షేమ పథకాల క్యాలండర్, గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్న ప్రజా సేవల వివరాలు, సిటిజన్ చార్ట్ తదితర అంశాల వివరాలు స్కీంవారీగా ఉండాలని అన్నారు. స్పందన కౌంటర్లు ఏర్పాటు చేసి గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందించ వల్సిన సేవలను మెరుపర్చాలని సూచించారు. సుమారు 544 సేవలు సచివాలయాల ద్వారా ప్రజలకు అందించవల్సి ఉన్నా లక్ష్యం మేరకు సేవలు అందించలేకపోవడం మంచి పరిణామం కాదని, డిజిటల్ అసిస్టెంట్లు, కార్యధర్శులు ఈ విషయంలో శ్రద్ద వహించాలన్నారు. కోవిడ్, కరోనాను ఎదుర్కోవడంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కష్టపడుతున్నారని, 2500 మంది సిబ్బందితో, 938 టీంలతో సూపర్ శానిటేషన్ పనులు అన్ని గ్రామాలలో జరుగుతున్నాయని అన్నారు. అలాగే మండలానికి రెండు గ్రామ పంచాయతీలు మనం మన పరిశుభ్రత కార్యక్రమాలలో భాగంగా జిల్లాలో 96 గ్రామ పంచాయతీలు పైలట్ గ్రామాలుగా ఎంపిక కాబడ్డాయని వ్యర్ద రహిత గ్రామాల లక్ష్యంగా మనం మన పరిశుభ్రత కార్యక్రమం జరుగుతుందని డిపిఓ విశ్వనాథ్ అన్నారు. 24.06.2020


Comments