పొదుపు సంఘాల మహిళలకు బాసటగా నిలుస్తున్న వైయస్సార్ ఆసరా అనంతపురం (ప్రజాఅమరావతి), సెప్టెంబర్ 16: వైయస్సార్ ఆసరా పథకం పొదుపు సంఘాల అక్కాచెల్లెళ్లకు బాసటగా నిలుస్తోంది. నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు నుండి జగనన్న అమ్మ ఒడి, వసతి దీవెన, కాపు నేస్తం, విద్యాదీవెన, వైయస్సార్ చేయుత, రుణమాఫీ, ఇళ్లపట్టాలు మంజూరు, దిశ చట్టం అమలుతోపాటు ప్రస్తుతం అనేక ప్రభుత్వ పథకాలలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మహిళా లోకం చేతులెత్తి నమస్కరిస్తున్నారు. మహిళలందరి తరఫున వైయస్ జగన్ కలకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని మనసారా ఆశీర్వదిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం శివారు ప్రాంతంలోని శిల్పారామం లో బుధవారం వైఎస్ఆర్ ఆసరా పథకం వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి విడతగా వైయస్సార్ ఆసరా పథకం ద్వారా 543 సంఘాలకు సుమారు రూ. 5.08 కోట్లు మంజూరు కావడంతో రుద్రంపేట, నారాయణపురం, రాజీవ్ కాలని, అనంతపురం రూరల్ పంచాయతీల గ్రామాల నుండి పొదుపు సంఘం మహిళలు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసరా పథకం పై పలువురు పొదుపు సంఘాల మహిళలు తమ అభిప్రాయాలు తెలియజేశారు. 1) వైయస్సార్ ఆసరా పథకం ప్రారంభించిన రోజు నుండి తమలాంటి పేద కుటుంబాల్లో పండుగ వాతావరణం వచ్చిందని శ్రీ భాగ్యలక్ష్మి పొదుపు మహిళా సంఘం సభ్యురాలు టీవీ టవర్ ప్రాంత నివాసి ఉష పేర్కొన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మహిళల జీవితాలకు బంగారు బాటగా, ఒక మార్గదర్శిగా వైయస్సార్ ఆసరా పథకం ప్రవేశ పెట్టినట్లు పేర్కొంది. అక్కా చెల్లెమ్మలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలా అండగా నిలుస్తూ ఈ పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళల అప్పులన్నీ నాలుగు దశల్లో తమ ఖాతాల్లోకి జమ చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం లేదని మహిళల పక్షపాతిగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ప్రస్తుతం తనకు వైయస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.14,000 ఖాతాలో జమ అయిందని, తన కుటుంబానికి ఫీజు రీఎంబర్స్మెంట్ మంజూరు కావడంతో తన పిల్లలు బాగా చదువుతున్నారని పేర్కొంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. 2) ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు.. అందులో భాగంగా వైయస్సార్ ఆసరా పథకం ప్రవేశ పెట్టడం చాలా సంతోషం కలిగిస్తోందని అనంతపురం రూరల్ మండలం నగరం తపోవనంకు చెందిన ఈశ్వర సంఘం సభ్యురాలు ముత్యాలమ్మ తెలిపింది. గత ప్రభుత్వం మాకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని, దానివల్ల చాలా నష్టపోయినట్లు తెలిపింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల జీవితాల్లో వెలుగు నింపుతున్నట్లు తెలిపింది. మహిళలకు కాపు నేస్తం ద్వారా ఐదు సంవత్సరాల్లో సుమారు రూ.75 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ మొదటి సంవత్సరంలోనే ఇప్పటికే రూ.15 వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అలాగే ఒంటరి మహిళలకు, వితంతువులకు గతంలో పింఛన్లు కూడా సక్రమంగా మంజూరు కాలేదని, ప్రస్తుతం అర్హులైన వారందరికీ ప్రతినెల 1వ తేదీన ఇంటి వద్దకే పెన్షన్లు అందుతున్నాయని తెలియజేసింది. ప్రజాసంక్షేమం కోసం, మహిళల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఈశ్వర మహిళా పొదుపు సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం తనకు వైయస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.13 వేల రూపాయలు అందుతున్నదని, తమ్ సంఘ సభ్యులకు మొత్తం సుమారు ఒక లక్షా 31వేల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ కాబడినది అని తెలిపింది. తాను అమ్మబడి, పెన్షన్ లాంటి పథకాల ద్వారా లబ్ది పొందుతున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ఈ డబ్బుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటానని తన అభిప్రాయాన్ని తెలియజేసింది. 3) మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అందిస్తున్నారని నారాయణపురం పంచాయతీకి చెందిన అల్లామదీనా ముస్లిం మైనారిటీ పొదుపు సంఘం సభ్యురాలు ఎస్. ఫాతీమా తెలియజేసింది. వైయస్సార్ ఆసరా లాంటి పథకం గతంలో ఎక్కడా కూడా ప్రారంభించలేదని, కుటుంబాలలోని మహిళలకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని ముఖ్యమంత్రి గుర్తించి పొదుపు సంఘాలను ఆదుకుంటున్నట్లు తెలిపింది. చిన్న చిన్న వ్యాపారంతో తామంతా ఉపాధి పొందాలన్న ఆశయంతో ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయుటకు చర్యలు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. మా కుటుంబాల బంగారు భవిష్యత్తుకు ముఖ్యకారకులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని తెలియజేసింది. ప్రస్తుతం తమ సంఘానికి సుమారు రూ. 3,97,591 రూపాయలు తమ ఖాతాల్లోకి జమ చేసినట్లు తెలిపింది. ఇంత పెద్ద సహాయాన్ని అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ లబ్ధి పొందిన ఈ డబ్బుతో కిరాణా కొట్టు ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించు ఉంటానని తెలియజేసింది. 4) గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేరుస్తూ చేతల ప్రభుత్వంగా ప్రజలకు అన్ని విధాలుగా సేవలందిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని శ్రీ షిరిడీ సాయి పొదుపు మహిళా సంఘం సభ్యురాలు భువనేశ్వరి తన అభిప్రాయాన్ని తెలియజేసింది. పొదుపు సంఘాల కష్టసుఖాలను తెలుసుకొని ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని వైయస్సార్ ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపింది. మా లాంటి నిరుపేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో మేలు చేస్తున్నట్లు తెలిపింది. మహిళా అభివృద్ధి ద్వారానే కుటుంబ అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రహించిన ప్రభుత్వం ప్రతి పథకాల్లో మహిళలకు చేయూత అందిస్తున్నట్లు తెలిపింది. మహిళా సంక్షేమానికి కృషి చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపింది. తన ఖాతాల్లోకి జమ అయిన డబ్బు ద్వారా పండ్ల వ్యాపారం చేసుకుంటానని, తమకోసం జగనన్న ఉన్నాడనే ఆత్మవిశ్వాసంతో జీవిస్తానని పేర్కొంది. ప్రస్తుతం తమ పొదుపు సంఘానికి 50వేల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపింది. ఇంత పెద్ద మనస్సుతో మమ్మల్ని ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసింది.


Comments