విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Popular posts
Today India Opens New Frontiers in Himalayan Climate Research, Says Dr. Jitendra Singh.
• GUDIBANDI SUDHAKAR REDDY
NISE’s New PV Lab to Set Global Benchmarks in Solar Testing Capabilities: Union Minister Shri Pralhad Joshi
• GUDIBANDI SUDHAKAR REDDY

NEW INDIA IS "LAND OF OPPORTUNITIES" WITH RAPID REFORMS: LOK SABHA SPEAKER.
• GUDIBANDI SUDHAKAR REDDY
పశుపోషకులకు 50 శాతం రాయితీపై పశుదాణా పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం ...
• GUDIBANDI SUDHAKAR REDDY

ఇది నా ఊరు నా బాధ్యత
• GUDIBANDI SUDHAKAR REDDY

Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment