*అన్న‌దాత కోసం ఎందాకైనా* *రైతుల సంతోషమే ల‌క్ష్యంగా రాజీ లేని ప‌రిపాల‌న* *క‌ర్ష‌కుల సంక్షేమం జ‌గ‌న‌న్న ల‌క్ష్యం* *అన్న‌దాత‌ల కోసం దేశంలోనే గొప్ప ప‌థ‌కాలను ప్ర‌వేశ‌పెట్టిన ఘ‌న‌త జ‌గ‌న‌న్నదే* *ఆర్థిక ప‌రిపుష్టి దిశ‌గా రాష్ట్ర రైత‌న్న‌లు* *చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు* *పాద‌యాత్ర‌లో భాగంగా రైతు స‌ద‌స్సు* అన్న‌దాత కోసం ఎందాకైనా వెళ్లే సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు అని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. పాద‌యాత్ర‌లో భాగంగా నాదెండ్ల‌లో మంగ‌ళ‌వారం రైతు స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పంట పండించే క‌ర్ష‌కుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటున్నామ‌ని చెప్పారు. రైతు భ‌రోసా ప‌థ‌కం ద్వారా ప్ర‌తి రైత‌న్న‌కు ఏటా రూ.13,500 ఆర్థిక సాయం చేస్తున్నామ‌ని చెప్పారు. వైఎస్సార్ ఉచిత విద్యుత్ ప‌థ‌కం కింద వ్య‌వ‌సాయానికి తొమ్మిదిగంట‌ల‌పాటు నిరంత‌రాయంగా నాణ్య‌మైన విద్యుత్ అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు. క‌రువు వ‌స్తే ఆదుకోవ‌డానికి రూ.2వేల కోట్ల ప్ర‌కృతి విపత్తు నిధిని కేటాయించిన తొలి ప్ర‌భుత్వం త‌మ‌దేన‌ని చెప్పారు. గిట్టుబాటు ధ‌ర క‌ల్పించేందుకు రూ.3వేల కోట్ల ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధిని ఏర్పాటుచేసిన తొలి సీఎం కూడా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు మాత్ర‌మేనని తెలిపారు. వైఎస్సార్ జ‌ల‌క‌ళ ప‌థ‌కం ద్వారా మెట్ట భూములున్న రైతు సోద‌రులంద‌రికీ ఉచితంగా బోర్లు వేస్తున్నామ‌న్నారు. బోర్లుతోపాటు మోటారు, క‌రెంటు క‌నెక్ష‌న్‌.. ఇలా రూ.ల‌క్ష‌కు పైగా ల‌బ్ధిని అన్న‌దాత‌ల‌కు చేకూర్చ‌బోతున్నామ‌ని వివ‌రించారు. వైఎస్సార్ సీపీ అధికారంలో వ‌చ్చాక వ‌ర్షాలు కూడా బాగా కురుస్తున్నాయ‌ని, భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయ‌ని వివ‌రించారు. సాగునీటికి ఇబ్బందులే లేకుండా చూస్తున్నామ‌ని వెల్ల‌డించారు. *రైతుల‌తో ముఖాముఖి* ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని పాదయాత్ర మొద‌లైన నాటి నుంచి మ‌హిళా స‌దస్సు, విద్యా స‌ద‌స్సు, రైతు స‌ద‌స్సు.. ఇలా ప‌లు స‌ద‌స్సులు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఆయా చోట్ల ఆయా వ‌ర్గాల వారితో ముఖాముఖి నిర్వ‌హిస్తూన్నారు. నాదెండ్ల‌లోనూ రైతుల‌తో ఆమె ప్ర‌త్యేకంగా ముఖాముఖి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు రైతులు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వంలో తామంతా ఆనందంగా ఉన్నామ‌ని చెప్పారు. అన్ని ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని తెలిపారు. పొలాల‌కు వెళ్లే డొంక రోడ్లు స‌రిచేయాల‌ని, సాగునీటి వ‌న‌రులు ఇంకొంచె పెంచాల‌ని నియోజ‌క‌వ‌ర్గ రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆ ప‌నుల‌ను వెంట‌నే చేప‌ట్టి ప‌రిష్కారం చూపుతామ‌ని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా యఘ్నేశ్వర రెడ్డి,రాష్ట్ర ముస్లిం సంచార జాతుల డైరెక్టర్ షేక్ దరియా వలి,రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ కొండెబోయిన అనూష,నాదెండ్ల మండల అధ్యక్షుడు గొంటు శ్రీనివాసరెడ్డి,మాజీ అధ్యక్షుడు కంజుల వీరారెడ్డి, చిలకలూరిపేట మండల అధ్యక్షుడు దేవినేని శంకరరావు,ఎడ్లపాడు మండల అధ్యక్షుడు కల్లూరి బుజ్జి,చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్,నాదెండ్ల మండల రైతు కమిటీ అధ్యక్షుడు మంగు ఏడుకొండలు, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,పట్టణ ముస్లిం, మైనారిటీ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి వీరాంజీనేయులు, నాదెండ్ల మండల జడ్పీటీసీ అభ్యర్థి కాట్రగడ్డ మస్తాన్ రావు,ఎడ్లపాడు మండల జడ్పీటీసీ అభ్యర్థి ముక్తా వాసు,చిలకలూరిపేట మునిసిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థి కొలిశెట్టి శ్రీనివాసరావు, నాదెండ్ల ఎంపీటీసీ అభ్యర్థులు కుంభా అంకమ్మ,గుడికందుల యల్లారావు,దావులూరి ఏసమ్మ నాదెండ్ల గ్రామ పార్టీ నాయకులు కోనేటి నాగయ్య,కాట్రగడ్డ రామకృష్ణ, నల్లమోతు రామారావు,నెల్లూరి వెంకయ్య,నల్లమోతు పట్టాభి,నల్లమోతు హరిబాబు,దూల్లిపాళ్ల అదియ్య,పుల్లగూర రమేష్,మిరియాల చిన్న కోటయ్య,జంగా రామాంజనేయులు, గోరంట్ల సుబ్బారావు,కొరివి లక్ష్మయ్య,షేక్ దరియా వలి,షేక్ మీరా,దావులూరి అక్కయ్య,దావులూరి రామారావు,ఇప్పర్ల చిన్న,రాయపూడి ప్రసాద్,మరియు పలువురు రైతులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.