రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతో వికసించనున్న బాలల స్వప్నాలు. . ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన జగనన్న అమ్మ ఒడి,జగనన్న గోరుముద్ద,జగనన్న వసతి దీవెన,అంగనవాడీలబలోపేతం, వైయస్సార్ బడుగు వికాసం, జగనన్న విద్యా కానుక, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ తదితర పథకాలు ఆంధ్రప్రదేశ్ లోని బాలల వికాసానికి ఎంతగానో తోడ్పడుతుందని ఈనెల 14వ తేదీన గుంటూరు లోని తుఫాన్ నగర్ లో గల మదర్స్ సా విద్యా సంస్థలో జరిగిన బాలల దినోత్సవ సభలో మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. బాలల దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో బాల కార్మికులు లేకుండా బడిఈడు పిల్లలందరూ బడిలో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషిని కొనియాడారు.నేటి బాలలు మంచి కలలు కని వాటిని సాకల్యం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి స్మరించుకున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా దిశ పౌండేషన్ వ్యవస్థాపకులు బక్కి రెడ్డి సుబ్బాయమ్మ మదర్స్ సా లో ని అనాధ పిల్లలందరికీ భోజనం అందించారు.ఈ సందర్భంగా సుబ్బాయమ్మ ప్రసంగిస్తూ వారానికి ఒక రోజు మదర్స్ సా విద్యాసంస్థలోవున్న చిన్నారులకు భోజన సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారులు స్వాతంత్ర ఉద్యమ చరిత్రను అవగాహన చేసుకొని భారతదేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింపచేసేవిధంగా కృషి చేయాలన్నారు.బాలల దినోత్సవ కార్యక్రమంలో అబ్దుల్ కల్లం ట్రస్టు తరఫున పిడికిటి భూపాల్, ఆపిల్ స్కూల్ డైరెక్టర్ బీమానాదం పేరి రెడ్డి, మదర్స్ సా విద్యా సంస్థ నిర్వాహకులు షకీరా కౌశర్ , ప్రిన్సిపల్ షేక్ రఫీ తదితరులు ప్రసంగించారు. చిన్నారులు ఆటపాటలతో సభికులను ఉత్తేజపరిచారు. వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి చైర్మన్ మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9949930670