నెల్లూరు (ప్రజా అమరావతి),నవంబర్,15; సర్వేపల్లి నియోజకవర్గం, టి.పి.గూడూరు మండలం నరుకూరు గ్రామంలో "జనంలో నాడు-జనం కోసం నేడు కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి . జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 18 నెలల కాలం పాటు సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేపట్టి ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి, అమలు చేయకుండా మోసం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో గానీ, ఎన్నికల్లో గానీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుట్రలకు పాల్పడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకుండా అడ్డుపడుతూ విమర్శలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ గొంతు చించుకున్న సోమిరెడ్డి అక్రమాలకు పాల్పడిన వారు తన బినామీలే అని తేలిపోవడంతో నోరు మూసుకున్నాడు. సోమిరెడ్డి ధాన్యం కొనుగోళ్లపై విచారణ చేపట్టాలని పదేపదే డిమాండ్ చేసి, ప్రభుత్వం విచారణ ప్రారంభించడంతో ధాన్యం అమ్ముకున్న రైతులకు తమ ఖాతాల్లో నిధులు జమ కాక అష్టకష్టాలు పడుతున్నారు. సోమిరెడ్డి రైతు సమస్యలను తెరపైకి తెచ్చి, తర్వాత దళిత సమస్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి, *"రైతు ద్రోహి"* గా *"దళిత ద్రోహి"* గా మిగిలిపోయాడు. రైతుల అమ్మిన ధాన్యానికి సంబంధించిన నగదును ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి వీలైనంత త్వరగా జమ చేయిస్తాం. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తాం. జోరువానను సైతం లెక్కచేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి, మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.


Comments