*సామాన్యుల కష్టాలు తెలిసిన బైడెన్..* వాషింగ్టన్ (ప్రజా అమరావతి), నవంబర్ 15: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అపూర్వ విజయం దక్కించుకున్న జో బైడెన్ సెనేటర్ గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగి అధ్యక్షునిగా ఎన్నికైన తీరు అద్భుతం.. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి అగ్ర రాజ్యానికి అధినేతగా ఎదిగిన జో బైడెన్ రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుంటే.. పెన్సిల్వేనియాలో ఓ క్యాథలిక్ కుటుంబంలో 1942 లో జో బైడెన్ జన్మించారు. జో బెడెన్ అసలు పేరు జో రాబినేట్ బైడెన్ జూనియర్. మొదట యూనివర్సిటీ ఆఫ్ డెలావేర్, సిరక్యూస్ యూనివర్సిటీ ఆఫ్ లా లో తన ఉన్నత విద్యాభాసాన్ని జో బెడెన్ పూర్తి చేశారు. ఆ తర్వాత రాజకీయం వైపు ఆయన మొగ్గు చూపారు. మొదటి సారిగా 1972 లో డెలావర్ రాష్ట్రం నుంచి ఆయన సెనేటర్ గా ఎన్నికయ్యారు. మొత్తం ఆయన ఆరుసార్లు సెనేటర్‌గా పని చేశారు. ఆ తర్వాత 1988, 2008 లో రెండు సార్లు అధ్యక్ష పదవి కోసం ఆయన ప్రయత్నించారు. ఒబామా హయాంలో రెండు సార్లు అమెరికా ఉపాధ్యక్షునిగా పని చేశారు. స్వంత పార్టీలో ఆయనకు అనుకున్నంత మద్దతు లభించక పోవడంతో ఆయన తన లక్ష్యాన్ని సాధించలేక పోయారు. కానీ మూడో సారి ప్రయత్నంలో ఆయన విజయం సాధించడంతో అమెరికా అధ్యక్షుడు కావాలన్న ఆయన కల నెరవేరింది. జోసెఫ్ రోబినెట్ బైడెన్ జూనియర్ 1942 లో పెన్సిల్వేనియా రాష్ట్రం లోని స్క్రాంటన్ లో జన్మించారు. ఐర్లాండ్ నేపథ్యం ఉన్న ఓ కాథలిక్ కుటుంబంలో ఆయన జన్మించారు. బైడెన్‌కు చిన్నతనంలో నత్తి ఉండేది. స్కూల్ దశలో ఈ లోపం ఆయనను బాగా బాధించింది. ఈ సమస్యను అధిగమించేందుకు అద్దం ముందు నిలుబడి తడబడకుండా మాట్లాడేందుకు ప్రయత్నించే వాడు. కొన్ని నెలల తరువాత ఈ లోపాన్ని అధిగమించాడు. బైడెన్, మొదట యూనివర్సిటీ ఆఫ్ డెలవేర్‌లో, తరువాత సిరక్యూస్ యూనివర్సిటీ లా స్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. మొదటి భార్య నెలియా ను వివాహమాడిన తరువాత విల్మింగ్టన్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. జో బైడెన్ 1972 లో తొలిసారి సెనేటర్ ఎన్నికల్లో గెలిచారు. పదవిని స్వీకరించే సమయం లోనే కారు ప్రమాదంలో ఆయన భార్య, కూతురు మృతి చెందారు. కుమారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ తన బిడ్డలకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి గది నుంచే డెమొక్రటిక్ పార్టీ సెనేటర్‌గా బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. బైడెన్ సెనెటర్ పదవి చేపట్టిన తరువాత వ్యక్తిగత జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. భార్య, కూతురి మరణం తరువాత తన కొడుకులిద్దరికీ మంచి జీవితం అందించాలనే తాపత్రయంతో సొంతిల్లున్న డెలవేర్ నుంచి వాషింగ్టన్ కు నిత్యం ప్రయాణించే వారు. తదనంతరం, స్కూల్ టీచర్ అయిన జిల్ జాకబ్స్ ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత బైడెన్ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. 1987 లో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి పోటీలో తొలిసారిగా అడుగు పెట్టే ప్రయత్నాలు చేశారు. 1991, అక్టోబర్ 11న యూనివర్సిటీ ఆఫ్ ఒక్లహామా లో న్యాయశాస్త్ర అధ్యాపకురాలు అనిటా హిల్, అమెరికా సుప్రీంకోర్టు న్యాయవాది క్లారెన్స్ థామస్ మీద వేసిన కేసు విచారణ జరుగుతోంది. రోనల్డ్ రీగన్ ప్రభుత్వంలో కలిసి పని చేసినప్పుడు క్లారెన్స్ థామస్ తనను పలుమార్లు లైంగికంగా హింసించారని అనిటా హిల్ కేసు వేశారు. అమెరికాలో అందరూ ఈ కేసు విచారణ చూడటానికి టీవీలకు అతుక్కుపోయారు. అమెరికా సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఈ విచారణ జరుపుతోంది. ఈ కమిటీ ఛైర్మన్ గా జో బైడెన్ విచారణకు అధ్యక్షత వహించారు. అనిటా హిల్ సాక్ష్యాల విషయంలో బైడెన్ వ్యవహరించిన విధానం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అనిటా హిల్ కు మద్దతుగా నిలిచిన పలువురు మహిళలను బైడెన్ సాక్ష్యం చెప్పడానికి పిలవలేదు. గతేడాది ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ కేసు గురించి మాట్లాడుతూ బైడెన్ ‘‘ఆవిడతో వ్యవహరించిన విధానానికి సిగ్గు పడుతున్నాను’’ అని చెప్పారు. 2008 లో బైడెన్ మళ్లీ అధ్యక్ష పోటీలో అడుగు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నం కూడా విజయవంతం కాలేదు. అయితే, అప్పుడు డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న బరాక్ ఒబామా, తనకు తోడుగా ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి జో బైడెన్ ను ఎంచుకున్నారు. ఆ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ గెలిచింది. ఒబామా-బైడెన్ జంట ఆ తర్వాత 2012 అధ్యక్ష ఎన్నికల్లోనూ గెలిచింది. బైడెన్ అనేకమార్లు ఒబామా ను తన సోదరునిగా అభివర్ణించారు. ఒబామా, తన అధ్యక్ష పదవి ఆఖరు రోజుల్లో బైడెన్‌కు అమెరికా దేశ అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం పురస్కారం ఇచ్చి సత్కరించారు. గొప్ప దశ లోనూ బైడెన్ కు వ్యక్తిగతమైన బాధలు తప్పలేదు. 2015 లో ఆయన కుమారుడు బౌ బ్రెయిన్ 46 ఏళ్ల వయసులో క్యాన్సర్ తో మరణించారు. దీంతో బైడెన్ కొన్నాళ్లు చాలా కుంగిపోయారు. బౌ బైడెన్ రాజకీయాల్లో తన తండ్రికి వారసుడిగా కొనసాగుతారని అందరూ ఆశించారు. 2016 లో బౌ డెలవేర్ రాష్ట్ర గవర్నర్‌గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంతలోనే ఈ విషాదం జరిగింది. *అమెరికా 46 వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎంపికయ్యారు..* మహమ్మారి కరోనా ను కట్టడి చేస్తారని అమెరికా ప్రజలు బలంగా నమ్మి ఆయనకు ఓటు వేశారు. అంతే కాదు, వర్ణ వివక్షను, జాతి భేదం లేకుండా అమెరికా లో అందరికి సమానమైన పాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకు ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ను ఎన్నుకున్నారు. అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయసు కలిగిన అధ్యక్షుడిగా జో బైడెన్ ఎంపికయ్యారు. 77 ఏళ్ళ వయసులో అయన అమెరికా అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారు. అయితే, జో అధ్యక్షుడు కావాలనే కల ఇప్పటిది కాదు. 27 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జో 40 ఏళ్ల వయసులో తొలిసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. కానీ, అతని ప్రసంగాలు కాపీ కొట్టినట్టు ఉండటంతో పార్టీ ఆయన్ను పక్కన పెట్టింది. జో మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. చిన్నప్పుడు ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జో తండ్రి సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలో జో పాలు పంచుకున్నాడు. 1972లో జో మొదటి భార్య నెలియా, కూతురు క్రిస్మస్ షాపింగ్‌కి వెళ్లి వస్తుండగా కారు ప్రమాదంలో మరణించారు. 1975 లో జో బైడెన్‌కి జిల్ పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఆయన్ను వివాహం చేసుకుంది. జో తన ప్రసంగాలతో దేశాన్ని ఆకట్టుకున్నారు. అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రసంగించారు. జో ప్రసంగాలకు మంచి పేరు ఉంది. అయన తన ప్రసంగానికి లక్ష డాలర్లు తీసుకునే వారట. ప్రసంగాల ద్వారా, పుస్తకాల ద్వారా అయన ఎక్కువ డబ్బు సంపాదించారు. 2008 లో ఒబామా అధ్యక్షుడిగా ఎంపికైన సమయంలో జో ను ఉపాధ్యక్షుడిగా ఎంచుకున్నారు. విదేశాంగ విధానంపై జో కు మంచి పట్టు ఉండటమే ఇందుకు కారణం. జో రెండుసార్లు ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2020 లో జో అమెరికా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ (జో బైడెన్) ఒక అమెరికన్ రాజకీయ నాయకుడు. అతను 2009 నుండి 2017 వరకు అమెరికా 47 వ ఉపాధ్యక్షునిగా పని చేశాడు, 1973 నుండి 2009 వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెనేట్ లో డెలావేర్కు నుండి ప్రాతినిధ్యం వహించాడు. 2020 ఎన్నికలలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు డెమొక్రాటిక్ పార్టీ తరుపు నుండి విజయం సాధించి అమెరికా 46 వ అద్యక్ష్యుడు అయ్యడు. బైడెన్ 2020 యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ ను ఓడించారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆయన 2021 జనవరి 20 నుండి 46 వ అధ్యక్షుడిగా కొనసాగుతారు. కాథలిక్ కుటుంబంలో నలుగురు తోబుట్టువులలో మొదటి వాడు అతనికి ఒక సోదరి ఇద్దరు సోదరులు ఉన్నారు, బైడెన్ పెన్సిల్వేనియా లోని స్క్రాన్టన్ డెలావేర్లోని న్యూ కాజిల్ కౌంటీ లో పెరిగారు. విద్యా పరంగా అతను ఒక పేద విద్యార్థి కాని విద్యార్థులలో సహజ నాయకుడిగా ఎన్నికయ్యాడు. అతని జూనియర్, సీనియర్ సంవత్సరాల్లో తరగతి విద్యార్థుల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. డెలావేర్ విశ్వ విద్యాలయం 1965 సంవత్సరాల్లో బైడెన్ 1966 ఆగస్టు 27 న న్యాయ విద్యార్థిగా ఉన్నప్పుడు బైడెన్ నీలియా హంటర్ ను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు. 1961 లో పట్టభద్రుడయ్యాడు. అతను 1965 లో డెలావేర్ విశ్వ విద్యాలయం నుండి తన బ్యాచిలర్ డిగ్రీని సంపాదించాడు. చరిత్ర, రాజకీయ శాస్త్రంలో డబుల్ 688 లో 506 తరగతి ర్యాంకుతో పట్టభద్రుడయ్యాడు. అతను సిరక్యూస్ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందే ముందు డెలావేర్ విశ్వ విద్యాలయంలో చదువుకున్నాడు. 1969 లో న్యాయవాదిగా అయ్యాడు, 1970 లో న్యూ కాజిల్ కౌంటీ కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు. 1972 లో డెలావేర్ నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాల సెనేట్ కు ఎన్నికయ్యాడు, అతను అమెరికన్ చరిత్రలో ఆరవ-అతి పిన్న వయస్కుడైన సెనేటర్ అయ్యాడు. 30 ఏళ్ళ వయసులో (పదవిని నిర్వహించడానికి అవసరమైన కనీస వయస్సు) అమెరికా చరిత్రలో బైడెన్ ఆరవ-అతి పిన్న వయస్కుడైన సెనేటర్ అయ్యాడు. 31 ఏళ్ళకు ముందే పదవీ బాధ్యతలు స్వీకరించిన 18 మందిలో ఒకరు. బైడెన్ ఆరు సార్లు సెనేట్ కు ఎన్నికయ్యాడు, 2009 యు.ఎస్ లో ఉపాధ్యక్ష పదవిని చేపట్టడానికి రాజీనామా చేసినప్పుడు నాల్గవ అత్యంత సీనియర్ సెనేటర్. 1972 డిసెంబరు 18 న ఎన్నికల తరువాత కొన్ని వారాల తరువాత బైడెన్ భార్య నీలియా వారి ఒక సంవత్సరం కుమార్తె నవోమి ఆటోమొబైల్ ప్రమాదంలో మరణించారు. బైడెన్ తన రెండవ భార్య జిల్ ను 1975 లో కలిశాడు. వారు 1977 లో వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. బైడెన్ పెద్ద కుమారుడు బ్యూ డెలావేర్ అటార్నీ జనరల్ ఇరాక్ లో పని చేసిన ఆర్మీ జడ్జి అడ్వకేట్ అయ్యాడు. 2015 మే 30 న మెదడు క్యాన్సర్‌తో రెండేళ్ల యుద్ధం తరువాత అతను 46 సంవత్సరాల వయసులో మరణించాడు. అతని చిన్న కుమారుడు హంటర్ వాషింగ్టన్ న్యాయవాది లాబీయిస్ట్ అయ్యాడు. 1972 లో తన మొదటి ఎన్నిక తరువాత బైడెన్ 1978, 1984, 1990, 1996, 2002, 2008 లలో మరో ఆరుసార్లు సెనేట్ పదవికి ఎన్నికయ్యారు. సాధారణంగా 60% ఓట్లు సాధించారు. అతను బలమైన వ్యతిరేకతను ఎదుర్కోలేదు. అప్పటి గవర్నర్ గా ఉన్న పీట్ డు పాంట్ 1984 లో అతనిపై పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. తన రిపబ్లికన్ సహోద్యోగి విలియం రోత్ రెండేళ్ల సీనియారిటీ కారణంగా బైడెన్ జూనియర్ సెనేటర్‌గా 28 సంవత్సరాలు గడిపాడు. టామ్ కార్పెర్ 2000 లో రోత్‌ను ఓడించిన తరువాత బైడెన్ డెలావేర్ సీనియర్ సెనేటర్ అయ్యాడు. తరువాత అతను డెలావేర్ చరిత్రలో ఎక్కువ కాలం పని చేసిన సెనేటర్ అయ్యాడు. 2018 నాటికి యు.ఎస్ చరిత్రలో 18 సంవత్సరాలు-ఎక్కువ కాలం పని చేసిన సెనేటర్. జో బైడెన్ ఎన్నికల పోటికీ అమెరికా రాష్ట్రా సెనేటర్ అభ్యర్థి డగ్ జోన్స్ అక్టోబరు లో 2017. 2008 లో బైడెన్ డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ నామినీ బరాక్ ఒబామా సహచరుడు. 1991లో గల్ఫ్ యుద్ధాన్ని వ్యతిరేకించాడు. 2007 లో యుఎస్ దళాల పెరుగుదలను వ్యతిరేకించాడు. 2011 లో యుఎస్ దళాలను ఉపసంహరించు కోవడం ద్వారా ఇరాక్ పట్ల యుఎస్ విధానాన్ని రూపొందించడంలో సహాయపడ్డాడు. హింసాత్మక నేర నియంత్రణ చట్ట అమలు చట్టం మహిళలపై హింస చట్టం ఆమోదించే ప్రయత్నాలకు బైడెన్ నాయకత్వం వహించాడు. బైడెన్ 1988 డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం పోటీ పడ్డాడు. 1987 ఆగస్టు నాటికి సిబ్బంది పోటీల కారణంగా మెసేజింగ్ గందరగోళానికి గురైన బైడెన్ ప్రచారం, 108-109 మైఖేల్ డుకాకిస్ డిక్ గెఫార్డ్ట్ కంటే వెనుకబడి పోయింది, అతనికి మద్దతు దారుల బలమైన సమూహం లేక పోవడం, 88-89 అతను 1987 సెప్టెంబరు 23 న పోటీ నుండి వైదొలిగాడు. 1988 లో విఫలమైనప్పటి నుండి బైడెన్ మళ్ళీ అధ్యక్ష పదవికి పోటీ చేయడం గురించి ఆలోచించాడు. 2007 జనవరి 31 న రెండవసారీ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాడు. మొత్తంమీద బైడెన్ నిధుల సేకరణలో ఇబ్బంది పడ్డాడు, ప్రజలను తన ర్యాలీ లకు ఆకర్షించడానికి చాలా కష్టపడ్డాడు, ప్రత్యర్థి బారక్ ఒబామా సెనేటర్ హిల్లరీ క్లింటన్ ఉన్నత స్థాయి అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆకట్టుకోవడం, మద్దతు పొందడంలో మళ్లీ విఫలమయ్యాడు. డెమొక్రాటిక్ అభ్యర్థుల జాతీయ ఎన్నికలలో ఐదవ స్థానంలో నిలిచి పోటి నుండి వైదొలిగాడు. విజయం సాదించనప్పటికీ బైడెన్ తన 2008 ప్రచారం ఫలితంగా సానుభూతి, విలువ ప్రపంచంలో పెరిగింది. ముఖ్యంగా ఇది బైడెన్ ఒబామా మధ్య సంబంధాన్ని మార్చి వేసింది. అధ్యక్ష పదవి నుండి బైడెన్ వైదొలిగిన కొద్ది కాలానికే ఒబామా తన పరిపాలనలో బైడెన
Popular posts
కష్టంలో అండగా...
• GUDIBANDI SUDHAKAR REDDY

వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వివరాలు అందించాలి.
• GUDIBANDI SUDHAKAR REDDY

కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈఎల్ఐ పథకం ద్వారా విస్తృత ప్రయోజనాలు: ప్రాంతీయ పి ఎఫ్ కమిషనర్ అబ్దుల్ ఖాదర్
• GUDIBANDI SUDHAKAR REDDY
101 MOUs Signed at International Reverse Buyer-Seller Meet in Tirupati, Opening Global Opportunities for AP MSMEs.
• GUDIBANDI SUDHAKAR REDDY

మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు ప్రభుత్వం వరం.
• GUDIBANDI SUDHAKAR REDDY

Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment