*అన్నిరకాల క్రీడలకు నిలయంగా విజ్జి స్టేడియం. స్టేడియం పనుల తనిఖీలో మంత్రి బొత్స. విజ‌య‌న‌గ‌రం (ప్రజా అమరావతి),  న‌వంబ‌రు 15;  అన్నిరకాల క్రీడలకు నిలయంగా విజ్జీ స్టేడియంను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ తెలిపారు.  ఆదివారం మంత్రి విజ్జి స్టేడియంలో జరుగుతున్న పనులను తనిఖీ చేసారు.  క్రికెట్ స్టేడియం, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్ రింగ్, ఖేలో ఇండియా కింద చేపడుతున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులపై ఆరా తీసారు.  ప్రస్తుతం జరుగుతున్న పనులు, చేయాల్సిన పనులు, అవసరమైన నిధులు, తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారుచేసి ఇవ్వాలని, సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి పనులు జరిగేలా చూస్తానని అధికారులకు సూచించారు.  ప్రస్తుతం జరుగుతున్నవి వేగంగా జరగాలని, డి.పి.ఆర్. ప్రకారం నిర్ధేశిత కాలంలో పూర్తి చేయాలని ఆయా ఇంజనీర్లను ఆదేశించారు.  ఖేలో ఇండియా క్రింద రూ.6 కోట్లుతో మల్టిపర్పస్ ఇండోర్ స్టేడియం పనులు జరుగు తున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన నిష్పత్తిలో నిధులు ఖర్చు చేయడం జరుగుతోందని, 60 శాతం పనులు పూర్తయ్యాయని శాప్ సహాయ సంచాలకులు రమణ తెలిపారు.  ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి రూ.3 కోట్లు నిధులు వచ్చాయని,  రూ2.5 కోట్లు విఎంఆర్డిఎ, 25 లక్షలు మున్సిపల్, 25 లక్షలు ఎం.పి. ల్యాడ్స్ నుండి రావలసి ఉందని ఎడి రమణ తెలిపారు.  విఎంఆర్డిఎ కమిషనర్ తో  టెలిఫోన్ ద్వారా నిధుల కోసం మంత్రి మాట్లాడారు.  విజ్జి స్టేడియం పనులు తనిఖీచేసి నిధులను విడుదల చేయాలని కమిషనర్ కోటేశ్వరరావును కోరారు . జిల్లాలో గతంలో మంజూరైన వై.ఎస్.ఆర్. క్రీడా వికాస కేంద్రాల పనులను కూడా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.  రాజీవ్ క్రీడా మైదానాన్ని కూడా తనిఖీ చేసి అక్కడ కూడా క్రీడాకారులకు అనువుగా వుండేలా అభివృద్ది చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  అదేవిధంగా ఎ.పి. మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రోజక్ట్ రూ.20 కోట్లతో చేపట్టడం జరిగిందని, క్రీడా సౌకర్యాలు, అకామడేషన్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లను నిర్మించడం జరుగుతోందని, పనులు పురోగతిలో నున్నాయని రమణ వివరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలక్టరు జె. వెంకటరావు, ఆర్డిఓ భవానిశంకర్, సెట్విజ్ సిఇఓ పాల్గొన్నారు


Comments