వరల్డ్ టాయిలెట్ డే - జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో 2 జిల్లాలకు అవార్డులు


   వరల్డ్ టాయిలెట్ డే - జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో 2 జిల్లాలకు అవార్డులు

విజయవాడ:19-11-2020..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బహిరంగ మలవిసర్జనా రహితం(ODF)గా ప్రకటించబడింది. గ్రామీణ ప్రాంతాల్లోని సుస్థిరతమైన ODF స్థితి మరియు జీరో వేస్ట్ మేనేజ్ మెంట్ శూన్య చెత్త నిర్వహణ) సాధించడానికి అవగాహన కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహించడం ద్వారా మరియు తడి చెత్త - పొడి చెత్త పదార్థాల నిర్వహణ యందు నూతన టెక్నాలజీ విధానాన్ని అవలంభించడం ద్వారా ముందుకు సాగడం జరుతుంది.

జల శక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం వారు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకొని, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) నందు జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి పని తీరుపై మన రాష్ట్రంలో తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలను అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా గౌరవ కేంద్ర జలవనరుల శాఖా మాత్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ గారు తెలియజేస్తూ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు శ్రీ డి. మురళీధర్ రెడ్డి, ఐ.ఎ.ఎస్. మరియు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు శ్రీ రేవు ముత్యాల రాజు, ఐ.ఎ.ఎస్. గార్లకు అందజేశారు.

గౌరవ మంత్రివర్యులు,శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారి స్ఫూర్తితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి వారి మార్గదర్శకంలో, కమీషనర్ పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, మేనేజింగ్ డైరెక్టర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్, ఇంజనీర్-ఇన్-చీఫ్,RWS&S వారి కృషితో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుండి పుట్టినదే గ్రామ సచివాలయాలు మరియు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, ప్రజల జీవన మరియు వ్యవహారిక శైలిలో గణనీయమైన పెరుగుదలను స్థిరపరచడం జరిగినది.

గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు మరియు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న రోజుల్లో మరిన్ని జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడానికి అడుగులు వేస్తోందని,డా|| పి. సంపత్, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, విజయవాడ వారు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశా ru.