*ఒకే మొబైల్ నెంబర్‌ తో ఇంట్లో.. అందరికీ ఆధార్ కార్డులు..* న్యూఢిల్లీ: కొత్త ఆధార్ కార్డులు వచ్చాయి. వీటి కోసం ఆన్‌లైన్‌ లోనే ఆర్డర్ ఇవ్వొచ్చు.. అయితే రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం కుటుంబ సభ్యులందరికీ ‘మొబైల్’ నంబరు ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఒక్కరే అందరి కార్డుల కోసం ఆర్డర్ ఇవ్వొచ్చు. వివరాలిలా ఉన్నాయి. ఆధార్ కార్డును ఆన్‌లైన్‌ లో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కచ్చితంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలన్న విషయం తెలిసిందే. అయితే మొబైల్ నెంబర్ లేకపోయినా కూడా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదెలాగంటే.. యూఐడీఏఐ పాలివినైల్ క్లోరైడ్ (పీవీ) కార్డులు ఇందుకు ఉపయోగపడతాయి. ఇవి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పాన్ కార్డు మాదిరిగా ఉంటాయి. వాలెట్‌ లో తేలిక గానే ఇమిడి పోతుంది. ఈ కార్డులో తాజా భద్రతా ప్రమాణాలు కూడా ఉన్నాయి. అంతే కాదు.. కార్డు పకడ్బందీగా, గట్టిగా కూడా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నికకు వస్తాయి.


Comments