జాతీయ పత్రికా దినోత్సవం ప్రభుత్వం నిర్వహించాలి. ప్రధాని నరేంద్ర మోడీ జీవో విడుదల చేయాలి. రాష్ట్రం లోకొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలి. రేపుఅనంత లో జరిగే ప్రెస్ అకాడమీ ఆన్లైన్ క్లాసులో ప్రతి జర్నలిస్టు పాల్గొనాలి. మచ్చా రామలింగా రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ (APJDS) నవంబర్ 16 వ తారీఖున కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అన్ని రాష్ట్రాల్లో జాతీయ పత్రిక దినోత్సవం నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ అందుకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలన మచ్చా రామలింగా రెడ్డి డిమాండ్ చేశారు. జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకొని అనంతపురం నగరంలోని రోడ్డు భవనాల అతిథిగృహం నందు మచ్చా రామలింగా రెడ్డి ఈరోజు ఉదయం విలేకరుల సమావేశం లో మాట్లాడారు. జర్నలిస్టులకు ప్రాణాలకు తెగించి కనీస వేతనాలు లేకున్నా సమాజం కోసం పనిచేస్తున్న సరైన గుర్తింపు ఉండడంలేదని కనీస వేతనాలు కూడా ప్రభుత్వాలు చూపించలేక పోతున్నాయని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెజ్ బోర్డ్ అమలు చేయలేకపోతున్నారని ఇదేనా జాతీయ పత్రికా దినోత్సవం కి ఇచ్చే గౌరవం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు అయినా ఇంకా ఈ దేశంలో జర్నలిస్టు పట్ల వివక్ష కొనసాగుతుందని నేషనల్ ప్రెస్ డే అధికారికంగా నిర్వహించలేక పోతున్నారని ఇదేనా ప్రజాస్వామ్యం లో మీడియా కి ఇచ్చే గౌరవం అని అని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా పాలకులు ఆలోచించి జాతీయ పత్రికా దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తూ సమాజం కోసం పనిచేసిన జర్నలిస్టులను సీనియర్ జర్నలిస్టు లను ప్రభుత్వాలు సన్మానించి గౌరవించాలని మచ్చ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయినా ఇంకా జర్నలిస్టులకు పాత అక్రిడేషన్ లోనే రెన్యువల్ చేస్తూ కాలయాపన చేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో వెంటనే కొత్త అక్రిడేషన్లు లను మంజూరు చేయాలని అక్రిడేషన్ లు లేక జర్నలిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారని వాటిని దృష్టిలో పెట్టుకుని వెంటనే సమాచారశాఖ కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళన తప్పదని మచ్చా రామలింగా రెడ్డి హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో రేపు అనంతపురం జిల్లాలోని జర్నలిస్టులకు ఏర్పాటుచేసిన ఆన్లైన్ క్లాసులలో ప్రతి జర్నలిస్టు పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి జర్నలిస్టు బాధ్యతగా పాల్గొనాలని మచ్చా రామలింగా రెడ్డి విజ్ఞప్తి చేశారు. మేము అడిగిన వెంటనే జర్నలిస్టులకు అనంతపురంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించినందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి గారిని అభినందిస్తున్నానని భవిష్యత్తులో కంప్యూటర్ క్లాసులు కూడా అనంతపురం జిల్లాలో నిర్వహించాలని కోరారు. ఈ విలేకర్ల సమావేశంలో వెంకటేశులు భాస్కర్ రెడ్డి శాకీర్ బాలు శ్రావణ్ జానీ నాయక్ ,కుల్లాయి స్వామి,మల్లికార్జున తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు