Kurnool -(prajaamaravati), కర్నూలు జిల్లా కేంద్రం నుండి సుమారు150 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక సరిహద్దులో మన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవహిస్తున్న తుంగభద్ర నదీతీర ప్రారంభ ఘాట్ మెళిగనూరు పుష్కర ఘాట్-1, పుష్కర ఘాట్ -2 పనులను ఈ రోజు మధ్యాహ్నం తనిఖీ చేసి, పుష్కర ఘాట్ పనులను బాగా చేసారని అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్* *ఈ నెల 20 నుండి డిసెంబర్ 1 వరకు కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదీతీరంలో ఉన్న 21 ఘాట్స్ లలో పుష్కర పనులు దాదాపు పూర్తీ అయ్యాయి: కలెక్టర్ వీరపాండియన్* *కోవిడ్ -19 నిబంధనలు, కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, ప్రజారోగ్యం దృష్ట్యా తుంగభద్ర పుష్కర నదీ స్నానాలకు అనుమతి లేదు..ఇ-టికెట్ తో పుష్కర ఘాట్స్ వద్ద టైం స్లాట్ ప్రకారం సంప్రదాయ పూజలు/పిండ ప్రదానాలకు మాత్రమే అనుమతి ఉంది : కలెక్టర్ వీరపాండియన్* *అందువల్ల పుష్కర్ ఘాట్స్ వద్ద నదీ స్నానాలకోసం ఎవరూ దిగకుండా ఉండేలా పగడ్బందీగా బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేయాలని మేలిగనూరు పుష్కర్ ఘాట్స్ ఇంఛార్జి డిప్యూటీ కలెక్టర్ మల్లిక్జార్జున ను, ఇరిగేషన్ ఎస్ ఈ శ్రీరామచంద్ర మూర్తి, ఆర్ అండ్ బి ఈఈ శ్రీధర్ రెడ్డి లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్* *పుష్కర ఘాట్స్ వద్ద భక్తులకు ఉచిత భోజనాలు అందించే వారు కోవిడ్ నిబంధనల ప్రకారం ఎక్కువ మంది ఒకే చోట గమిగూడ కుండా చూడాలని...ప్యాకేట్స్ లో మాత్రమే భోజనాలను అందించాలని, ఎక్కువ కౌంటర్లను దారి పొడవునా దూర దూరంగా ఏర్పాటు చేసి భోజనం కౌంటర్ల దగ్గర రద్దీ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ వీరపాండియన్* *అనంతరం, కౌతాళం మండలం కర్ణాటక సరిహద్దులో తుంగభద్ర నదీతీరంలో ఉన్న నదీ చాగీ గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది మూవ్మెంట్ రిజిస్టర్, హాజరు పట్టే, తదితర రిజిస్టర్ లను తనిఖీ చేసి ప్రజా సమస్యలు/ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్* *మూవ్మెంట్ రిజిస్టర్, హాజరు పట్టీలో మధ్యాహ్నం అయినా సంతకం చేయకుండా ఎందుకు ఉన్నారని నదీచాగీ గ్రామ సచివాలయ వి.ఆర్.ఓ రామాంజులు ను, ప్రజా ఫిర్యాదులు, పరిష్కార వివరాలను కంప్యూటర్ లో సరిగా నమోదు చేయాలని, కోవిడ్ -19 వ్యాప్తి నియంత్రణ అవగాహన ప్రచార సామగ్రిని కూడా సచివాలయంలో ప్రదర్శన చేయాలని సచివాలయ సెక్రటరీ దశరథ్ ను, డిజిటల్ అసిస్టెంట్ ను మందలించిన కలెక్టర్ వీరపాండియన్* *అనంతరం, మంత్రాలయం మండలం కచాపురం పుష్కర్ ఘాట్, మంత్రాలయం పుష్కర్ ఘాట్స్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్* *జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వెంట పుష్కర ఘాట్స్ తనిఖీలు, గ్రామ సచివాలయ తనిఖీలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామసుందర్ రెడ్డి, ఆదోని ఆర్డిఓ రామకృష్ణ రెడ్డి, జడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య, డిపిఓ ప్రభాకర్ రావు, ఎస్ఈ లు శ్రీరామచంద్ర మూర్తి,సుబ్రమణ్యం, ఆర్టీసీ ఆర్ఎం వెంకటరామం, ఐ&పీఆర్ డిడి తిమ్మప్ప, ఆదోని డివిజన్, స్థానిక మండల అధికారులు..తదితరులు.