తప్పిపోయిన బాలికను 𝟮 గంటలలో ట్రేస్ చేసిన అనంతపురం పోలీసులు... అనంతపురం జిల్లా, గుంతకల్ పట్టణము కథలగేరి చెందిన అనూష అనే అమ్మాయి, పిల్లలు దినోత్సవము రోజున కొత్త బట్టలు కావాలని ఇంట్లొ తల్లినీ అడుగగా, తల్లి మన దగ్గర డబ్బులు లేవని చెప్పటంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. తల్లి మరియమ్మ 𝟮 టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ సమాచారం ఇవ్వడంతో, 𝗖𝗖 𝗽𝗼𝗼𝘁𝗮𝗴𝗲 లను పరిశీలిస్తు వెతుకుచుండగా మరియమ్మ ఇంటి నుండి 𝟮 కిలోమీటర్ల దూరంలో బీరప్ప గుడి వద్ద ఉన్న ఆగాపే చర్చ్ దగ్గర గుంతకల్ డి.యస్.పి. గారు, 𝟮 టౌన్ సి.ఐ గారు వెళ్లి పాప ఆచూకీ కనుగోవడం జరిగింది. తప్పిపోయిన బాలిక ను 𝟮 గంటలలో ట్రేస్ చేసి, కొత్త దుస్తులు కొనిచ్చిన 𝗦𝗗𝗣𝗢 ఉమ మహేశ్వర రెడ్డి గారిని మరియు సిబ్బందిని గుంతకల్ ప్రజలు అభినందించారు.