Tenali (prajaamaravati), రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెనాలి శాసన సభ్యులు. అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో తెనాలి పట్టణ పరిధిలోని పినపాడు కృష్ణుడి బొమ్మ సెంటర్ వద్ద నుండి మద్రాస్ గేటు, రేపల్లె గేటు, మారీస్ పేట కొత్త వంతెన, వహబ్ చౌక్, టెలిఫోన్ ఎక్స్చేంజి, చిట్టి ఆంజనేయస్వామి గుడి, బోస్ రోడ్డు, గాంధి చౌక్ మీదుగా శివాజీ చౌక్ సెంటర్ వరకు పాదయాత్ర చేసారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు,అభిమానులు,కార్యకర్తలు పాల్గొన్నారు.