తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌

        తిరుపతి, (ప్రజా అమరావతి); న‌వంబ‌రు 24              


తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ 


రాష్ట్రపతి వెంట అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ 


         తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని మంగ‌ళ‌వారం ఉద‌యం రాష్ట్రపతి గౌ|| రామ్‌నాథ్‌ కోవింద్‌ కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఉన్నారు.


           ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| రాష్ట్రపతి దంపతులకు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌‌, ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చక బృందంతో కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి ఛైర్మ‌న్‌ అందించారు. 


           ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్  గుప్తా, ఇంటెలిజెన్స్ ఐజి శ్రీ శశిధర్ రెడ్డి, టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ ర‌మేష్‌రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, విజివో శ్రీ మనోహర్, డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.



Comments