కర్నూలు జిల్లాలో నివర్ తుఫాన్ పై మరో సారి ఈ మధ్యాహ్నం జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించి అలర్ట్ చేసిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్



కర్నూలు జిల్లాలో నివర్ తుఫాన్ పై మరో సారి ఈ మధ్యాహ్నం జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించి అలర్ట్ చేసిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్.


*కర్నూలు జిల్లాలో కడప బార్డర్ లో ఉన్న మండలాలతో పాటు నల్లమలలో ఆత్మకూరు చుట్టుపక్కల ఉన్న మండలాల అధికారులు , చాగలమర్రి, ఆళ్ళగడ్డ, రుద్రవరం, సిరివెళ్ల, బనగానపల్లె, కోయిలకుంట్ల మండలాల అధికారులు, రుద్రవరం సమీపంలో ఉన్న  వక్కిలేరు వద్ద  మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్*


*నివర్ తుఫాన్ ప్రభావ ప్రాంతాల ప్రత్యక్ష పర్యవేక్షణకు కడప జిల్లా బార్డర్ లో ఉన్న చాగలమర్రి, ఆళ్ళగడ్డ ప్రాంతాలకు జేసీ (రెవెన్యూ) రామసుందర్ రెడ్డి ని, నల్లమల లో ఉన్న ఆత్మకూరు ప్రాంతానికి జేసీ(సంక్షేమం) సయ్యద్ ఖాజాను పంపి, జిల్లా కేంద్రం నుండి ప్రతి క్షణం మానిటర్ చేస్తున్న జిల్లా కలెక్టర్ వీరపాండియన్*


*ఈ మధ్యాహ్నం చాగలమర్రి పరిసర ప్రాంతాల్లో  పర్యటించనున్న జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప*



*మండలాల్లో తహసీల్దార్ లు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరగకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చర్యలు తీసుకోవాలని, పంట నష్టం, ఇళ్ల నష్టం తదితర నివర్ తుఫాన్ నష్టాల నివేదికలను ఉన్నదున్నట్లు వెంటనే రిపోర్ట్ చేయాలని తహసీల్దార్ లను ఆదేశించిన కలెక్టర్ వీరపాండియన్*


*కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి ప్రతి రెండు గంటలకు ఒకసారి మండల కంట్రోల్ రూమ్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని తనకు పంపాలని,  ఎప్పటి కపుడు మండల, డివిజనల్ అధికారులతో మాట్లాడుతూ రియల్ టైం రిపోర్ట్స్ తెప్పించాలని, అప్రమత్తంగా ఉండాలని డిఆర్ఓ, విపత్తుల నిర్వహణ డిపిఎం లను ఆదేశించిన  కలెక్టర్ వీరపాండియన్*


*నివర్ తో పాటు డిసెంబర్ 2 వరకు మరో రెండు తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన మేరకు మండల అధికారులు హెడ్ క్వార్టర్స్ లో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన కలెక్టర్ వీరపాండియన్*


*తుఫాన్ సహాయక చర్యల 24×7 కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు.. వాటి నెంబర్లు 👇🏻*

*కర్నూలు కలెక్టరేట్ ; 08518-277305* 

*నంద్యాల ఆర్డీఓ కార్యాలయం: 08514-221550/8333989013*

*ఆదోని ఆర్డీఓ కార్యాలయం: 8333989012*

*కర్నూలు ఆర్డీఓ కార్యాలయం - 8333989011*: 


Comments