శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (prajaamaravati): ఈరోజు దేవస్థానము నందు కార్తీక మాసము సందర్భముగా కాఠక పారాయణలు, జపములు, సహస్రలింగార్చన సేవలు జరిగినవి. మరియు కార్తీక సోమవారము సందర్భముగా మల్లేశ్వర స్వామివార్ల ఆలయము వద్ద లక్షభిల్వార్చన (మధ్యాహ్నం 02 గం.ల నుండి 07 గం.లకు) నిర్వహించబడినది. ఈ కార్యక్రమము ల యందు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ M.V.సురేష్ బాబు దంపతులు పాల్గొని అత్యంత భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమములు శాస్త్రోక్తముగా నిర్వహించారు. అనంతరము కార్తీక మాసము సందర్భముగా ఈ రోజు సాయంత్ర సమయములో నటరాజ స్వామీ ఆలయము ప్రక్కన ఊంజల్ సేవ(దీపారాధన సేవ) ను దేవస్థాన అర్చక సిబ్బంది నిర్వహించారు. ఈ సేవ నందు భక్తులు పాల్గొని దీపములు వెలిగించారు. మరియు మల్లీశ్వరాలయము వద్ద కార్తీక మాసము సందర్భముగా ప్రతి రోజు సాయంత్రం జరుగుచున్న సహస్ర లింగార్చన సేవను ఆలయ అర్చక సిబ్బంది నిర్వహించడము జరిగినది. కార్తీక మాసము సందర్భముగా మల్లేశ్వరాలయము వద్ద జరుగు లక్షభిల్వార్చన (మధ్యాహ్నం 02 గం.ల నుండి 07 గం.లకు) సేవ తదుపరి ది., ది.23-11-2020, ది.25-11-2020, ది.30-11-2020, ది.07-12-2020, ది.11-12-2020, ది.13-12-2020 మరియు ది.14-12-2020 రోజుల యందు జరుగును. కార్తీకమాసము నందు ప్రత్యేకముగా జరుపబడు లక్ష భిల్వార్చన(రూ.2000 /- లు), సహస్ర లింగార్చన(మ.గం. 03-00 ల నుండి సా. 07 గం.ల వరకు) (ఒక రోజునకు రూ.500 /-లు టిక్కెట్, నెలకు రూ.5116 /- లు), ఊంజల్ సేవ(రూ.50 /- లు) మరియు ఇతర ఆర్జిత సేవా టికెట్లు దేవస్థానము యొక్క వెబ్సైటు www.kanakadurgamma.org నందు గానీ, మొబైల్ ఆప్(ఆండ్రాయిడ్ playstore) ‘kanakadurgamma’ నందు కానీ, మీ-సేవ సెంటర్లు నందు కానీ పొందగలరు.


Comments