చిత్తూరు (prajaamaravati); 11 ప్రజల భాగస్వామ్యంతోనే మద్య రహిత సమాజ స్థాపన. . ఆంధ్రప్రదేశ్ ను మద్య రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వ కృషితో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరమని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 11వ తేది న చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎక్సైజ్& సెబ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.అక్రమ మద్యం ను అరికట్టడంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పాత్ర అభినందనీయమన్నారు.సెబ్ ఏర్పడిన మే 16 నుండి నేటి వరకు అక్రమ మద్యం పై 50 వేల కేసులు నమోదు చేసి 60వేల మందిని అరెస్టు చేశారని,3.5 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని,3లక్షల లీటర్ల నాటుసారాను పట్టుకోవడంలో "సెబ్ "ప్రత్యేక పాత్ర పోషించిదన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సెబ్ కు అక్రమ మద్యం,ఇసుక తో పాటు గ్యాంబ్లింగ్, గుట్కా,ఎర్రచందనం, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ లాంటి అక్రమాలను అప్పజెప్పడం హర్షణీయమన్నారు.దశల వారీ మద్య నిషేధం అమలులో 90 లక్షల డ్వాక్రా మహిళలతో పాటు 5 లక్షల మంది వాలంటీర్లు,సచివాలయ సిబ్బందిని భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు.ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ మార్కండేయులు ఐఏయస్, అడిషనల్ ఎస్పీ రిషాంత్ రెడ్డి ఐపియస్, ఎక్సైజ్ &సెబ్ అధికారులు పాల్గొన్నారు.


Comments