. ఏలూరు (prajaamaravati) , నవంబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యతను ఇస్తుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీ విద్యార్ధి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు రాజు అన్నారు . బుధవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మ దినోత్సవం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమం జరిగింది. భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా రాబోయే తరాలకు ఉన్నత విద్యను అందించేందుకు కృషిచేసిన మహోన్నత వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. ఇదే తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి తరానికి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో విద్యకు తొలి ప్రాధాన్యతను ఇస్తు దని అందులో భాగంగానే నాడు-నేడు పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారుతున్నాయని, విద్యాకానుక పేరుతో ప్రతి విద్యార్ధికి స్కూల్ బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, షూప్, బెల్ట్, షాక్సులు, యూనిఫారాం వంటివి పంపిణీచేయడం జరిగిందని చెప్పారు. నాణ్యమైన భోజనం, ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటివి అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలనే తపనతో ఉంటాయని చెప్పారు. కార్పొరేట్ విద్యాసంస్థల కంటే మెరుగైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటారనే విషయం గుర్తించాలన్నారు. అబుల్ కలాం ఆజాద్ వంటి మహనీయుల ముందుచూపును గ్రహించి విద్యార్ధులందరూ రోల్ మోడల్ గా ఉండాలని అన్నారు .ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా ప్రయత్నించాలని ఆయన సూచించారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ ) శ్రీ కె వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ అబుల్ కలాం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు. భారత ప్రభుత్వంలో తొలి విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్లు నిర్విరామంగా పనిచేసిన మహనీయుడు కలాం అని కొనియాడారు. విద్యావ్యవస్థలో పలుమార్పులను తీసుకువచ్చిన గొప్ప దార్శనీకుడు కలాం అని అన్నారు. అబ్దుల్ కలాం చిన్న వయసులోనే పుస్తకాలు రాయడం మొదలు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు .ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా విద్యార్ధులు నడుచుకొని, మంచి విద్యను అభ్యసించి మంచి విద్యావేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. శాసనమండలి సభ్యులు శ్రీరామ సూర్యారావు మాట్లాడుతూ అబుల్ కలాం గొప్ప దార్శనికుడు అని అన్నారు. గొప్ప నాయకులు ఒక కులానికో వర్గానికో సంబంధించిన వారు కాదని గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన అన్నారు. తొలుత అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు . అనంతరం విద్యార్థిని, విద్యార్థులకు నిఘంటువులు బహుమతిగా అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసులు , జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీ పద్మావతి ,జిల్లాఅధికారులు ఉపాధ్యాయులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.


Comments