* నీటి సంరక్షణ లో వైఎస్ ఆర్ కడప జిల్లాకు జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం * జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, కేంద్ర జల్ శక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి సురేష్ కుమార్ ల నుండి ప్రసంశలు * జిల్లా నీటియాజమాన్య సంస్థ, భూగర్భజల శాఖల అధికారులకు కలెక్టర్ అభినందనలు కడప (prajaamaravati), నవంబర్ 11 : నీటి సంరక్షణ లో వైఎస్ ఆర్ కడప జిల్లాకు జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం లభించింది. కేంద్ర జల్ శక్తి అభియాన్ ప్రాజెక్టు పనుల నిర్వహణకు సంబంధించి.. బుధవారం రెండవ జాతీయ నీటి సంరక్షణ అవార్డుల ఎంపిక జరిగింది. ఇందులో సౌత్ రీజన్ స్థాయిలో వైఎస్ఆర్ కడప జిల్లాకు ఉత్తమ పురస్కారం లభించింది. ఈ సందర్బంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, కేంద్ర జల్ శక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి సురేష్ కుమార్ లు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కు అభినందనలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో 2019 నేషనల్ వాటర్ అవార్డ్స్ నందు కడప జిల్లా జాతీయ దక్షిణ ప్రాంత విభాగములో ఉత్తమ జిల్లాగా నీటి సంరక్షణ విభాగం నందు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. గత 10 సంవత్సరాల్లో నమోదైన వర్షపాత వివరాల పరిశీలన ఆధారంగా.. ఈ ఉత్తమ పురస్కారం లభించింది. జిల్లాలో ఉపాధి హామీ పనులు, ఇతర పనుల ద్వారా చేపట్టిన ఐదు రకాలయిన జల సంరక్షణ పనుల నిర్వహణలో భాగంగా.. ఉత్తమ ఫలితాలు సాధించడంతో.. ఈ అవార్డు దక్కింది. వాటర్ కన్జర్వేషన్ మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్వహణలో 1,92,103 పనులకు గాను.. 52,890 పనులను జియో టాగ్ చేయడం జరిగింది. రినోవేషన్ ఆఫ్ ట్రెడిషనల్ మరియు ఇతర నీటి వనరులు, చెరువు పనులకు సంబంధించి.. 25617 పనులకు గాను 23765 పనులు జియో టాగ్ చేయడం జరిగింది. రి యూస్ అండ్ రిచార్జి స్ట్రక్చర్ పనులకు సంబంధించి.. 23447 పనులకు గాను 10823 పనులు, వాటర్ షెడ్ డెవెలప్మెంట్ క్రింద 48,304 పనులకు గాను.. 28,410 పనులు, యింటెన్సివ్ అఫారెస్టేషన్ క్రింద... 18,389 పనులకు గాను... 5,969 పనులను జియో టాగ్ చేయడం ద్వారా.. మొత్తం 1,20,857 జియో ట్యాగ్ చేయడం ద్వారా.. శాస్త్రీయంగా పరిగణలోకి తీసుకుని.. కేంద్ర జల్ శక్తి అభియాన్ అవార్డుల ఎంపికలో మన జిల్లా సౌత్ రీజన్ స్థాయిలో ఉత్తమ పురస్కారాన్ని సాధించింది. *** అవార్డు కైవసం - గత నేపథ్యం... గత ఏడు సంవత్సరాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదు కావడంతో.. ప్రతి ఖరీఫ్ సీజన్ పంటల విస్తీర్ణంపై ఆ ప్రభావం పడేది. ఈ కారణంగా అధిక బోరు బావుల వినియోగంతో... భూగర్భ జల నీటిని వినియోగించుకొని ఖరీఫ్ పంటలను కాపాడు కుంటున్నారు . అలాగే.. ప్రతి సంవత్సరం 5000 నుండి 8000 ల బోరు బావులు కొత్తగా పుట్టుకొచ్చేవి. బావుల సంఖ్య అధికంగా పెరగడంతో.. గడిచిన రెండు సంవత్సరాల్లో 15 % నుండి 25 % బోరు బావులు అడుగంటిపోయే పరిస్థితి ఎదురయ్యింది. ఆ పరిస్థితికి జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదు కావడం కూడా ఒక కారణం అయింది. 2009-10 నుండి 2019-20 అనగా 11 సంవత్సరాల కాలంలో ఏడేళ్ల పాటు భూగర్భ జల కరువు సంవత్సరాలుగా పరిగణించదమైంది. అంతే కాకుండా.. అక్టోబర్, 2001 నుండి నవంబర్ 2019 కాలం లో భూగర్భ జల మట్టం 9.15 మీ నుండి 19.33 మీ లోతుకు పడిపోవడం జరిగింది. పై పరిస్థితులను అధిగమించాలంటే , భూగర్భ జల శాస్త్రవేత్తల సహకారంతో వివిధ రకాల కృత్రిమ భూగర్భ జలవృద్ధి నిర్మాణాలు అయిన.. 289 చెక్ డ్యామ్స్ , 912 నీటి నిల్వ చెరువులు , 17583 వ్యవసాయకుంటలు , 108.90 లక్షల క్యూబిక్ మీటర్ల చెరువు పూడిక తీత పనులు తదితర 17499 భూగర్భ జల వృద్ధి నిర్మాణాలను 2018-19 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. నీటిని సక్రమంగా సద్వినియోగం కోసం బిందు, తుంపర సేద్యం వంటి నూతన యాజమాన్య పద్ధతులు ఉపయోగించేలా గ్రామస్తులను ప్రోత్సహించడం జరిగింది. ప్రస్తుత సంవత్సరం 3.57 TMC ల భూగర్భ జలం వివిధ వర్షపాతం క్రిందఏర్పాటుచేసిన నిర్మాణాల వలన వృద్ధి చెందింది. అలాగే ... 12797 బోరు భావులలో నీరు వృద్ధి చెందడం వలన 31994 ఎకరాల భూమి పరోక్షంగా నీటి పారుదల జరిగినది . ఇదే కాకుండా , 45.961 TMC నీటిని తెలుగు గంగా ప్రాజెక్టు , GNSS మరియు KC కాలువ ద్వారా 8 చెరువులు మరియు 105 చెక్ డ్యామ్స్ నీటితో నింపడమైనది. వీటి వలన 18.38 TMC నీరు భూగర్భ జలము వృద్ధి చెంది , 65888 బోరు బావులు ప్రభావితమై , దీని వలన 164722 ఎకరాల ఆయకట్టు పరోక్షంగా పారుదల జరిగినది . పై అంశాలను పరిగణలోనికి తీసుకొని వైఎస్ ఆర్ కడప జిల్లాకు జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా ఎంపిక చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ వారి నేతృత్వములో భూగర్భ జల శాస్త్రవేత్తల సాంకేతిక పరిజ్ఞానంతో , జిల్లా నీటి యాజమాన్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో వివిధ పథకాలు అమలుపరచడం ద్వారా ఇది సాధ్యమైనది. ఈ సందర్బంగా... నీటి సంరక్షణతో జాతీయ పురస్కారంతో.. జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చిన డ్వామా పిడి యధు భూషణ్ రెడ్డి, జిల్లా భూగర్భజల శాఖ డిడి మూరళీధర్, అనుబంధ శాఖల సిబ్బందిని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ప్రశంసించారు.


Comments