"సోమిరెడ్డి వ్యవహార శైలితో రైతులకు కష్టాలు"* నెల్లూరు (prajaamaravati), సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామంలో "ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు" కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి . జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్దఎత్తున అమలు చేస్తుండటంతో ప్రజలు నీరాజనం పడుతున్నారు. చంద్రబాబు పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక ఉనికి కోల్పోతున్నామని ఆవేదనతో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి మోకాలడ్డుతున్నాడు. మహానేత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో సకాలంలో వర్షాలు పడి, రైతులు ఆనందంగా గడిపితే, చంద్రబాబు పాలనలో రైతులు కరువుతో విలవిలలాడి, మరలా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సమృద్ధిగా సాగునీరు అందడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడడం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. దశాబ్దకాలంగా సర్వేపల్లి రిజర్వాయర్ మరమ్మతులకు నోచుకోక రైతులు ఆందోళన పడుతుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్లిన వెంటనే రిజర్వాయర్ అభివృద్ధి పనులకు 11.34 కోట్లు మంజూరు చేశారు. సర్వేపల్లి రిజర్వాయర్ నుండి తిక్కవరపుపాడు దళిత రైతులకు ఎత్తిపోతల పథకానికి 1.87 కోట్లు మంజూరు చేయడం జరిగింది. రైతుల సంక్షేమం కోసం మేము తాపత్రయం పడుతుంటే, మంత్రిగా ఉన్నప్పుడు రైతులను అడ్డుపెట్టుకొని సోమిరెడ్డి నీరు-చెట్టు, రైతు రథం, మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి, నకిలీ ఎరువులు తయారు చేసి, రైతులకు అంతగట్టి రైతాంగానికి తీవ్ర ద్రోహం చేశాడు. నెల్లూరు జిల్లాలో రెండో పంటకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3లక్షల టన్నుల పైచిలుకు ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడం జరిగింది. సోమిరెడ్డి ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని జిల్లా కలెక్టర్ నుండి విజిలెన్స్ విభాగం వరకు రకరకాలుగా ఫిర్యాదు చేసి, రైతుల ఖాతాల్లో జమ కావలసిన నగదును జమ కాకుండా రైతులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. సోమిరెడ్డి కోరిన విధంగా ధాన్యం కొనుగోళ్లలో విచారణ జరిపితే, వడ్ల దొంగతనానికి పాల్పడిన వారంతా సోమిరెడ్డి బినామీలే. సోమిరెడ్డి రైతు శ్రేయస్సు కోరుకోకుండా ప్రభుత్వానికి అనేక రకాల ఫిర్యాదు చేయడంతో, ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేపట్టడంతో రైతుల ధాన్యం అమ్మకాలకు సంబంధించిన నగదు లావాదేవీలు ఆగిపోయాయి. రైతులు రెండో పంట ధాన్యాన్ని అమ్ముకొని వచ్చిన డబ్బుతో, మరలా మరో పంటకు సంబంధించి వ్యవసాయం ప్రారంభించే సమయంలో విచారణ జరుగుతూ, డబ్బులు ఆగిపోవడంతో సోమిరెడ్డి పుణ్యాన రైతులు అప్పుల కోసం వెతుక్కుంటూ తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నారు. సోమిరెడ్డి జిల్లాలో ఎక్కడికి వచ్చినా సోమిరెడ్డి విచారణ జరిపించాలనే డిమాండుతో తమకు రావలసిన డబ్బులు ఆగిపోవడంతో రైతులు సోమిరెడ్డిని చొక్కాపట్టుకుని నిలదీయడానికి సిద్ధపడుతున్నారు. సోమిరెడ్డి నాతో పోటీ చేసి ఓటమి పాలై, నాపై కక్ష తీర్చుకోవాలనే ఆలోచనతో నన్ను ఎన్ని విమర్శలు చేసినా, ఇబ్బంది లేదు కానీ, రైతుల విషయంలో రాద్ధాంతం చేసి వారికి రావలసిన వడ్ల డబ్బులు రాకుండా అడ్డుకోవడం ధర్మం కాదు. నెల్లూరు జిల్లా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి, ఉన్నతాధికారులతో మాట్లాడి, రైతులకు వీలైనంత త్వరగా ధాన్యాన్ని అమ్ముకున్న నగదును జమ చేయించడానికి ప్రయత్నిస్తా. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అనేక రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులతో పాటు, భగవంతుని కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నా.


Comments