.
నంద్యాలలో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ , జిల్లా కోర్టు కార్యాలయాల కోసం వివిధ భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప* *నంద్యాలలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, వాటి కొలతలు, భవనాల స్థితిగతుల వివరాల రిపోర్ట్ ను వెంటనే సమర్పించండి: నంద్యాల సబ్ కలెక్టర్, ఆర్&బి ఎస్ఈ లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్* కర్నూలు/నంద్యాల (prajaamaravati), నవంబర్12: జిల్లాల రీఆర్గనైజేషన్/కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న భవనాలు, మౌలిక సదుపాయాల గుర్తింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ నంద్యాలలో సుడిగాలి పర్యటన చేసి కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పడబోయే నంద్యాలలో జిల్లా కలెక్టర్, ఎస్పీ , జిల్లా కోర్టు కార్యాలయాల ఏర్పాటు కోసం వివిధ భవనాలను పరిశీలించారు. ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్ అండ్ బి ఎస్ఈ జయరామి రెడ్డి, మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తదితరులు జిల్లా కలెక్టర్ గారి వెంట భవనాల పరిశీలనలో పాల్గొన్నారు. గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్ అండ్ బి ఎస్ఈ జయరామి రెడ్డి లను వెంటబెట్టుకుని కొత్త కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను గుర్తించేందుకోసం నంద్యాల పట్టణం నడిబొడ్డున ఉన్న ఇరిగేషన్ కార్యాలయాల భవనాల సముదాయాన్ని, కోర్టు భవనాల సముదాయన్ని, తాలూకా ఆఫీసు, సబ్ కలెక్టర్ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు, ఎక్సయిజ్ ఆఫీసు, నూనెపల్లె, టెక్కే లలో ఉన్న మార్కెట్ యార్డుల భవనాలను, ఎస్.ఆర్.బీ.సీ. కాలనీ, విక్టోరియా రీడింగ్ రూమ్, జీఎం కాలేజీ, స్టేడియం, పశుసంవర్ధక శాఖ సెమెన్ బ్యాంక్ భవనాలు, ఆర్.ఏ.ఆర్.ఎస్, స్పిన్నింగ్ మిల్ తదితర వివిధ భవనాలను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పరిశీలించారు. అనంతరం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు కానున్న నంద్యాల జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉన్న వివిధ శాఖల ప్రభుత్వ భవనాలు, వాటి విస్తీర్ణం, స్థితి గతులపై సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, రహదారులు, భవనాల శాఖ ఇంజనీర్లు, మునిసిపల్ కమీషనర్ వెంకటకృష్ణ, డిఎస్పీ చిదానంద రెడ్డి తదితర అధికారులతో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప లు చర్చించారు. సమీక్ష సందర్భంగా, నంద్యాల కేంద్రంగా కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా కోసం ప్రస్తుతం నంద్యాలలో అందుబాటులో ఉన్న అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, వాటి చుట్టు కొలతలు, భవనాల స్థితిగతుల వివరాల అసెట్స్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించడానికి వీలుగా వెంటనే తనకు సబ్మిట్ చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్&బి ఎస్ఈ జయరామి రెడ్డి లను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం, నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గడివేముల మండలం ఘని గ్రామంలో సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం భూములను ఇచ్చిన 13 మంది రైతులకు రూ.1.57 కోట్ల ఆర్థిక పరిహారపు బ్యాంకు చెక్కులను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పంపిణీ చేశారు.
addComments
Post a Comment