*అంగన్వాడీ పోస్టుల ఇంటర్వ్యూలు పూర్తి* పార్వతీపురం (prajaamaravati), నవంబర్ 12:- అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ కార్యకర్తల కు సంబంధించి ఈ రోజు ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి వారి ఛాంబర్లో ఉదయం రెండవ రోజు ప్రారంభం అయ్యాయి. ముందుగా ఐ.సి.డి.ఎస్ అధికారులు, సిబ్బంది ఇంటర్వూకు హాజరైన అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. ద్రువపత్రాల పరిశీలన అనంతరం ప్రాజెక్ట్ అధికారి వారి ఛాంబర్లో ఇంటర్వూ ప్రారంభమైంది. రెండవ రోజు ఇంటర్వ్యూ లకు పాచిపెంట, మక్కువ, సాలూరు, రామభద్రాపురం మండలాల నుండి అంగన్వాడీ కార్యకర్తల 14 పోస్టులకు 31 అభ్యర్థులు, అంగన్వాడీ హెల్పర్ 36 పోస్టులకు 93 అభ్యర్థులు, మినీ అంగన్వాడీ కార్యకర్తల 10 పోస్టులకు 8 మంది అభ్యర్థులకు ఇంటర్వూ నిర్వహించారు. ఈ ఇంటర్వూ ప్రక్రియలో ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, ఐ.సి.డి.ఎస్ పి.డి రాజేశ్వరి, డిప్యూటీ డి. ఎం.అండ్.హెచ్.ఓ, సి.డి.పి.ఓ లు తదితరులు పాల్గొన్నారు.


Comments