ఏలూరు (prajaamaravati), 13. జిల్లాలో భూముల రికార్డులు పక్కగా నవీకరించాలి జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ ) శ్రీ కే వెంకటరమణారెడ్డి తాసిల్దార్ లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 899 గ్రామాలలో భూముల రికార్డు అందుబాటులో ఉందని అందులో ఇప్పటివరకు కేవలం 148 గ్రామాల్లో మాత్రమే భూముల రికార్డులను నవీకరించడం జరిగిందని ఆయన తెలిపారు .ప్రతి మండలంలో మూడు టీములు వేసుకోవాలని అందులో ఒకటి డిప్యూటీ తాసిల్దార్ 2 ఆర్ ఐ ,3 సర్వేయర్ తో టీ ములు వేసుకొని గ్రామం వారిగా రికార్డులను అప్ డేట్ చేయాలని అని ఆయన ఆదేశించారు. కొంతమంది తహసీల్దార్లు పంపించిన రికార్డులు సక్రమంగా ఉండడంలేదని సర్వే నంబర్ కు సంబంధించిన r s r / f l r కాఫీ లు జత చేయడం లేదని అని ఆయన తెలిపారు .సర్వే నంబరు లో లేని r s r లు జత చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. సబ్ డివిజన్ అయినా వాటిని రికార్డులలో నమోదు చేయడంలేదని , సబ్ డివిజన్ అయిన వాటి రికార్డులు కూడా సబ్మిట్ చేయడం లేదని ఆయన తెలిపారు . ఇదేవిధంగా ఇంకా కొన్ని తప్పులతో రికార్డులను పంపిస్తున్నారని అటువంటివి జరగకుండా తాసిల్దార్ లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామం వారిగా రికార్డులను సబ్ డివిజన్ అయిన వాటిని పరిశీలించి అన్నిటినీ నూరు శాతం సవరించి అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు. వారం రోజులలో ప్రతి మండలంలో 1/3 గ్రామాలు ఆన్లైన్లో అప్లోడ్ కావాలని ఆయన ఆదేశించారు. ఎవరైనా తప్పులు చేసినట్లయితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు . ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ శ్రీనివాస మూర్తి , నరసాపురం సబ్ కలెక్టర్ కలెక్టర్ విశ్వనాథన్ , ఆర్ డి వో లు లు తాసిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.