పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు (prajaamaravati)...13 ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు దీపావళి శుభాకాంక్షలు.. ఆనందకరమైన దీపావళి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వైస్సార్సీపీ కుటుంబ సభ్యులకు, అధికారులు, అనధికారులకు, మీడియా కుటుంబ సభ్యులకు, ఏలూరు నియోజకవర్గం ప్రజలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.. దీపావళి యొక్క దైవిక కాంతి మన అందరికి శాంతి, శ్రేయసు, ఆనందాన్ని అందిస్తుంది.కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో విపత్తులు జయించడానికి శాంతి, స్నేహం, మత సామరస్య న్ని నింపిన సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.. . ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతిఒక్కరూ కరోనా మహమ్మారి నేపథ్యంలో దీపావళి వేడుకలను జాగ్రత్తల నడుమ నిర్వహించుకోవాల ని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా గ్రీన్ క్రాకర్స్ కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దీపావళి అంటేనే టపాసుల సంబరం కావడంతో పర్యావరణ హితమైన గ్రీన్‌ క్రాకర్స్‌ను మాత్రం పరిమితంగా వినియోగించుకోవాలని, ఈ సమయంలో మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ పొరుగువారికి ఇబ్బంది కలగకుండా చూడాల నిమంత్రి ఆళ్ల నాని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ రోజు ప్రజలంతా ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని మంత్రి ఆళ్ల నాని ఆకాంక్షించారు..