శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:(prajaamaravati) ఈరోజు అనగా ది.16-11-2020 న ఉదయం 09 గం. లకు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ గారు ఆలయమునకు విచ్చేయగా శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి. సురేష్ బాబు గారు స్వాగతం పలికారు. ఆనంతరం మంత్రివర్యులు వారికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము వద్ద పూజలు నిర్వహించి, మల్లేశ్వరాలయ విస్తరణ పనుల ప్రారంభోత్సవ శిలాఫలకమును గౌరవనీయులైన దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆవిష్కరించి, ఆలయ అభివృద్ధి కొరకు సహకరించిన దాత శ్రీ సంగా నరసింహారావు గారిని సన్మానించారు. ఈ కార్యక్రమము నందు గౌరవనీయులైన దేవాదాయశాఖ కమీషనరు శ్రీ పి.అర్జునరావు, IAS గారు, ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు, పాలకమండలి సభ్యులు మరియు దాత శ్రీ సంగా నరసింహారావు గారు పాల్గొన్నారు.