శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ:(prajaamaravati), ఈరోజు అనగా ది.16-11-2020న ఉదయం గం.09.55 నిం. లకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన గృహ సముదాయము, గుణదల నందు నిర్మించిన నూతన కమ్యూనిటీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమమునకు గౌరవనీయులైన దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారు, ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు, ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు విచ్చేశారు. అనంతరం వీరు నూతనముగా నిర్మించిన కమ్యూనిటీ భవనం నందు శాస్త్రోక్తముగా పూజాది కార్యక్రమములు నిర్వహించి, గౌరవనీయులైన దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా కమ్యూనిటీ భవనం ప్రారంభించడం జరిగినది. అనంతరం కమ్యూనిటీ భవనం నందు భవానీ దీక్షలు -2020 ఆహ్వాన పత్రికను ఆవిష్కరించడం జరిగినది.


Comments