పోడూరు(prajaamaravati) : 16, పేదరికం విద్యకు అడ్డు రాకూడదు..... రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు... విద్య, వైద్యం కోసం ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు పెడుతోంది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్.... పాఠశాల అదనపు తరగతి గదులు ప్రారంభించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్..... పోడూరు మండలం తూర్పుపాలెం శివారు ఆనందరావు పేటలో సుమారుగా రూ: 6 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదిని సోమవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు , రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య లతో కలిసి ప్రారంభించారు. పేదరికం విద్య, వైద్యం కు అడ్డు రాకూడదని ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు పెడుతూ ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తోందని మంత్రివర్యులు తెలిపారు. నాడు- నేడు పథకం ద్వారా పాఠశాలలో గ్రీన్ బోర్డులు , మరుగుదొడ్లు, ప్రహరీగోడలు నిర్మాణం,అదనపు తరగతి గదులు,ఆంగ్ల బోధనకు ప్రయోగశాల (english lab),మొక్కలు నాటడం తదితర.. ఇలా 9 భాగాలు కూడుకొని పూర్తి సౌకర్యాలతో పాఠశాలను అభివృద్ధి చేసి,కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. పాఠశాల రూపు రేఖలు మార్చి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలకు ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పిల్లల తల్లిదండ్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేశామని అభివృద్ధి పనులలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆ కమిటీ అద్వర్యంలో నాణ్యతా లోపం లేకుండా పనులు జరుగుతాయన్నారు.రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి ఆంగ్లములో చదువుకొని విద్యార్ధులు ఉపాధి అవకాశాలు మెరుగు పరచుకోవాలనే ఉద్దేశ్యం తో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు.గోరుముద్దలు పధకము ద్వారా మధ్యాహ్న భోజనంలో నాణ్యమయిన భోజనాన్ని విద్యార్థులకి అందిస్తున్నామన్నారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ,అమ్మ ఒడి అనే పథకం చాలా అద్భుతమైన పథకం అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే దిశగా ఆ పథకం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టుముక్కల ఏసురత్నం, గుబ్బల వీరబ్రహ్మం, మేడిచర్ల దుర్గా వెంకట సత్యనారాయణ(పండు), కె నాగేశ్వరరావు, కడలి త్రిమూర్తులు, కె అమర్, నెల్లి ప్రసాద్, సునీల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.


Comments