అమరావతి (prajaamaravati); భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతి సందర్భంగా అల్ప సంఖ్యాకవర్గాల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:* *మైనారిటీల సంక్షేమం కోసం ఒక సువర్ణ అ«ధ్యాయాన్ని లిఖిస్తున్నాం* *అన్ని మతాలు, కులాల మధ్య అన్నదమ్ముల భావనను మరింతగా పెంపొందించేందుకు అన్ని ప్రోత్సాహకాలు అందజేస్తున్నాం* *ఈ 17 నెలల కాలంలో మైనారిటీలకు రూ.3428 కోట్ల లబ్ధి చేకూర్చాం* *అందులో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.2585 కోట్ల నగదు బదిలీ* *ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, ఇవ్వనున్న ఇళ్ల స్థలాల పట్టాలన్నింటిలోనూ అందే ప్రయోజనం రూ.843 కోట్లు* *ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటన* *చంద్రబాబు 5 ఏళ్లలో మైనారిటీలకు ఇచ్చింది రూ.2661 కోట్లు మాత్రమే* *ఇప్పుడు మైనారిటీలపై జూమ్‌లు, ట్విటర్‌లో ప్రేమ ఒలకపోస్తున్నారు* *నంద్యాలలో సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ను అరెస్టు చేస్తే బెయిల్‌ ఇప్పించారు* *వారి బెయిల్‌ రద్దు కోరుతూ ప్రభుత్వం సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది* సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి *వచ్చే ఏడాది నుంచి వైయస్సార్‌ పెళ్లి కానుక అమలు* *ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనాలు పెంపు* *పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు కూడా* *మైనారిటీ డే కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌* *అమరావతి:* భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతి సందర్భంగా అల్ప సంఖ్యాకవర్గాల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఆజాద్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మంత్రులు మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, కొడాలి నాని, సీఎస్‌ నీలం సాహ్ని, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, వివిధ మతాల పెద్దలు పాల్గొన్నారు. *ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:* – నేడు ఆజాద్‌ గారి జయంతి. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు. మానవతావాది. బహు భాషా ప్రావీణుడు. – దేశ తొలి విద్యా మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఎన్నో సేవలు అందించారు. – అందుకే ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. *ప్రియతమ నేత హయాంలో:* – 2008లో నాడు ప్రియతమ నాయకుడు వైయస్సార్‌ నిర్ణయం ప్రకారం, ఆజాద్‌ జయంతిని ౖమైనారిటీ సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్నాం. – అంటే మైనారిటీ వెల్ఫేర్‌ డేగా రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. *ఆయన సేవలు ఎనలేనివి:* – 1947 వరకు మన విద్యా వ్యవస్థ దేశ అవసరాలకు తగినట్లు లేదు. దాన్ని మన దేశ అవసరాలకు తగినట్లు మార్చేందుకు ఆజాద్‌ గారు ఎంతో కృషి చేశారు. – ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు పలు సంస్కరణలు అమలు చేశారు. – విద్యా శాఖలో భాగమైన బోర్డులు, సంస్థలు, కమిషన్లు, అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ (ఏఐసీటీఈ), యూజీసీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ప్రారంభించింది ఆజాద్‌ గారే. *ఇప్పుడు ఈ ప్రభుత్వం:* – రాష్ట్రంలో కూడా మన పిల్లల అవసరాలు, వారి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని విద్యా విధానంలో మార్పులు చేస్తున్నాం. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు తో సమూల మార్పులు చేస్తున్నాం. – చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పిల్లల దుస్తులు, షూస్, సాక్సులు ఇస్తున్నాం. – ఇంకా పుస్తకాలు నోట్‌ బుక్స్, బ్యాగ్స్‌ మొదలు తరగతి గదులు, టాయిలెట్లు, క్లీన్‌ వాటర్, కాంపౌండ్‌ వాల్‌ వరకు.. వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనం మెనూ నుంచి, వారి మంచి భవిష్యత్తు కోసం అమలు చేయాల్సిన కరిక్యులమ్, ఇంగ్లిష్‌ మీడియమ్‌ వరకు.. వారి పెద్ద చదువుల కోసం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నుంచి వారి లాడ్జింగ్, బోర్డింగ్‌ ఖర్చులు భరించే వరకు.. – ప్రతి ఒక్క విషయంలోనూ తల్లిదండ్రుల మాదిరిగా బాధ్యతగా ఆలోచించి వారి కోసం నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం మనది. *మైనారిటీల సంక్షేమం–నిధులు:* – రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ఒక సువర్ణ అ«ధ్యాయాన్ని లిఖిస్తున్నాం. – అలాగే అన్ని మతాలు, కులాల మధ్య అన్నదమ్ముల భావనను మరింతగా పెంపొందించేందుకు అన్ని ప్రోత్సాహకాలు అందజేస్తున్నాం. – అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, సున్నా వడ్డీ, పెన్షన్‌ కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, చేదోడు, వైయస్సార్‌ ఆసరా, నేతన్న నేస్తం, లా నేస్తం తదితర పథకాల ద్వారా గత నెల వరకు ఇలా అన్ని పథకాల్లో నేరుగా నగదు బదిలీ చేసిన మొత్తం రూ.2585 కోట్లు. – ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, ఇవ్వనున్న ఇళ్లస్థలాల పట్టాలు.. వీటన్నింటిలో మైనారిటీలకు అందే ప్రయోజనం రూ.843 కోట్లు. – గత అక్టోబరు వరకు 17 నెలల కాలంలో మన సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీలకు రూ.3428 కోట్ల లబ్ధి చేకూర్చాం. *చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో..:* – ఇవాళ మైనారిటీల మీద జూమ్‌లో, ట్విటర్‌లో ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్న ఒకాయన గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా, అయిదేళ్లలో మైనారిటీలకు అందించింది ఎంత అని చూస్తే.. 2014–15లో రూ.345 కోట్లు 2015–16లో రూ.340 కోట్లు 2016–17లో రూ.641 కోట్లు 2017–18లో రూ.667 కోట్లు 2018–19 లో రూ.668 కోట్లు మొత్తంగా 5 ఏళ్లలో కలిపి ఇచ్చింది రూ.2661 కోట్లు మాత్రమే. ఇంకా.. – ఒక్కరంటే ఒక్కరు మైనారిటీ మంత్రి లేని ప్రభుత్వాన్ని నడిపిన మహానుభావుడు. ఎన్నికల ముందు వరకు మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వలేదు. – కానీ ఈరోజు మైనారిటీల మీద తనకు ప్రేమ ఉందంటాడు. *నంద్యాల ఘటనలో డబుల్‌ గేమ్‌:* – నంద్యాల ఘటన బాధాకరం. ఆ ఘటనకు సంబంధించిన సెల్ఫీ వీడియో బయటకు రాగానే, న్యాయబద్ధంగా ఏం చేయాలో చేశాము. – తొలిసారిగా పోలీసులపై కేసు. తన, మన, పర అని చూడడం లేదు. పోలీసులపై కేసు పెట్టాం. అరెస్టు కూడా చేశాం. – కానీ వారికి గత ప్రభుత్వంలో ఉన్న పెద్దాయన పార్టీకి చెందిన, కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ రామచంద్రరావు అనే వ్యక్తి, ఆ ఇద్దరు పోలీసులకు బెయిల్‌ పిటిషన్‌ వేసి ఇప్పించాడు. – అంటే వారే బెయిల్‌ పిటిషన్‌ వేస్తారు. మళ్లీ ప్రభుత్వాన్ని నిందిస్తారు. – వారి పలుకుబడి ముందు మా పలుకుబడి సరిపోవడం లేదు. – ఆ బెయిల్‌ను క్యాన్సల్‌ చేయడం కోసం సెషన్స్‌ కోర్టుకు వెళ్లాం. *మైనారిటీల కోసం ఇంకా ఏమేం చేశాం:* – నిజాయితీగా మంచి చేయడం కోసం పని చేస్తున్నది మా ప్రభుత్వం. కానీ ఎలా బురద చల్లాలన్నదే వారి లక్ష్యం. – ఇవాళ మైనారిటీ సోదరుల కోసం అన్నీ చేస్తున్నాం. – హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలకు, హోలీ ల్యాండ్‌కు వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సహాయాన్ని రూ.30 వేల నుంచి రూ.60 వేలకు పెంచాం. – రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.60 వేలు, రూ.3 లక్షలకు పైబడి ఆదాయం ఉన్న వారికి రూ.30 వేలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. – ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజాన్‌లకు రూ.3 వేల గౌరవ వేతనం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గౌరవపూర్వకంగా అందిస్తున్నాం. – దీన్ని ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజాన్‌లకు రూ.5 వేలకు పెంచుతూ జనవరి 1న ఆదేశాలు జారీ చేశాం. – వక్ఫ్‌ బోర్డు, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర, చర ఆస్తులను రీసర్వే చేయించి వారి ఆస్తులు కాపాడే చర్యలు కూడా తీసుకుంటున్నాం. – క్రైస్తవులు, మిషనరీల ఆస్తులు కూడా కాపాడేందుకు రీ సర్వే చేపడుతున్నాం. *పదవులు–గుర్తింపు:* – నవరత్నాలలో అన్ని పథకాలు అమలు చేయడమే కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నాం. – నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో వారికి రిజర్వేషన్‌ కల్పించాం. అందుకు చట్టం కూడా చేశాం. – 5గురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. – 4గురు ఎమ్మెల్యేలు. ఇద్దరు ఎమ్మెల్సీలు ముస్లింలు. వారిలో ఒకరు మహిళ. *మాట నిలబెట్టుకున్నాం:* – 900 మదర్సాలలో చదివే 33 వేల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం వర్తింప చేస్తున్నాం. – దీనిపై నిరుడు ఇదే రోజున మైనారిటీల దినోత్సవంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. – గత ఏడాది మీరు అడిగారు. వెంటనే అమలు చేశాం. అందుకు గర్వంగా చెప్పగలుగుతాను. – మోడ్రన్‌ ఎడ్యుకేషన్‌ ఇస్తున్న మదర్సాలకు అమ్మ ఒడి, విద్యా కానుక పథకాలు వర్తింప చేస్తున్నాం. *అవి కూడా అమలు చేస్తాం:* – మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో ఇంకా రెండు మాత్రమే పెండింగ్‌. – వైయస్సార్‌ పెళ్లి కానుక. 2018 అక్టోబరు నుంచే చంద్రబాబు దాన్ని ఆపేశారు. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, వచ్చే ఏడాది నుంచి పథకం అమలు చేస్తాము. – ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనాలు పెంచడం, పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి. ఇవి కూడా వచ్చే ఏడాది నుంచి అమలు. *ఇంకా మంచి చేయాలన్న తపన:* – మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత. ఖురాన్, బైబిల్‌. – అందులో చెప్పిన ప్రతి మాట తప్పనిసరిగా అమలు చేస్తాను. – దేవుడి దయతో ఇవన్నీ చేశాము. రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాను. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు,


Comments