తాడేపల్లి (prajaamaravati); పంచాయితీరాజ్‌ కమీషనర్‌ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ చేయూత ఫేజ్‌ 2 కార్యక్రమం మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స సత్యనారాయణ, పంచాయితీ రాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్‌ సీఈవో రాజబాబు, మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు హజరు వైఎస్‌ఆర్‌ చేయూత ఫేజ్‌ 2 లబ్దిదారులు – 2,72,005 లబ్దిదారులకు విడుదల చేసిన డబ్బు – రూ. 510.01 కోట్లు 12.08.2020 రోజు సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభమైన కార్యక్రమం ఫేజ్‌ 1 లబ్దిదారులు – 21,00,189 లబ్దిదారులకు విడుదల చేసిన డబ్బు – 3,938 కోట్లు వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమం – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాల్లో ఉన్న 45 నుంచి 60 సంవత్సరాల మధ్య గల పేద అక్కచెల్లెమ్మలకు ఆర్ధికంగా అండగా నిలబడేందుకు ఈ చేయూత కార్యక్రమం శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమన్నారంటే... ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో మొదటి విడత సీఎంగారు చేతుల మీదుగా ప్రారంభమైంది, ఇప్పుడు రెండో విడత కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. 45 నుంచి 60 సంవత్సరాల మహిళలకు చేయూత నివ్వాలని సీఎంగారు మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు. డబ్బులు ఇవ్వడమే కాకుండా వారికి ఆర్ధికంగా ఆదుకునేలా దారిచూపాలి అని రూ. 75 వేలు వారికి అందేలా ఈ కార్యక్రమం రూపొందించారు. ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్ళు ఈ సహాయం అందజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రముఖ కంపెనీలను కూడా భాగస్వామ్యం చేయడంతో ప్రతీ కుటుంబానికి 15 నుంచి 18 శాతం అదనపు ఆదాయం వస్తుంది. ప్రముఖ దిగ్గజ కంపెనీలతో కూడా ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మహిళలను ఆర్ధికంగా సుస్ధిరపరిచేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. మొదటి విడతలో 21,00,189 మంది లబ్దిదారులకు రూ. 3938 కోట్లు విడుదల చేశాం. ఇప్పుడు రెండో విడతలో కూడా 2,72,005 మందికి రూ. 510 కోట్లు విడుదల చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద మొత్తంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సాయం చేయడాన్ని మనసారా స్వాగతిస్తున్నాను. శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారంటే... ఇవాళ వైఎస్‌ఆర్‌ చేయూత ఫేజ్‌ 2 కింద మొదటి విడతలో ఇచ్చిన వారు కాకుండా అప్పటికీ మిగిలిన వారికి కూడా సీఎం గారు ఆదేశానుసారం ఈ రోజు 2,72,005 మందికి రూ. 510 కోట్లు విడుదల చేస్తున్నాం. మా పార్టీ మ్యానిఫెస్టో మా భగవద్గీత. ఇందులో పొందుపరిచిన ప్రతీ విషయాన్ని నూటికి నూరు శాతం నెరవేర్చడమే మా ప్రభుత్వ ద్యేయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఇంత డబ్బు ఇచ్చి ఆయా కుటుంబాలు సద్వినియోగం చేసుకునేలా ఒక ధీర్ఘకాలిక ప్రణాళికతో ఈ కార్యక్రమం రూపొందించారు. ప్రభుత్వం ఒక భాద్యతగా ఫెసిలిటేట్‌ చేసి దేశంలోని దిగ్గజ కంపెనీలతో మాట్లాడి మార్కెట్‌ ధరలకంటే తక్కువకు వీరికి సరుకులు ఇప్పించే ఒక వెసులుబాటు ఇచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ఆయా వర్గాల మహిళలంతా సద్వినియోగం చేసుకుని మీ కాళ్ళపై మీరు నిలబడేలా చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా మీకు అందుబాటులో ఉంది. మీ ఇంటి నుంచే కాల్‌సెంటర్‌కు కాల్‌చేసి మీకు కావాల్సిన సరుకులు మీ షాప్‌కే తెప్పించుకునే వెసులుబాటు ఏర్పాటుచేశాం. అక్కాచెల్లెమ్మలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్ధికంగా ఎదిగేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మహిళలంతా సుఖంగా, సంతోషంగా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రెండో విడతలో భాగంగా 2,72,005 మంది లబ్దిదారులకు కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లోకి రూ. 510 కోట్లు విడుదల చేసిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రూ. 510 కోట్ల మెగా చెక్‌ను లబ్దిదారులకు అందజేసిన మంత్రులు, అధికారులు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ చేయూత పధకం ద్వారా లబ్దిపొందిన వివిధ లబ్దిదారులు తాము ఏ విధంగా లబ్దిపొందింది వివరించారు.


Comments