నెల్లూరు (prajaamaravati), సర్వేపల్లి నియోజకవర్గంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ బాబా గంధ మహోత్సవంలో పాల్గొని, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి. కసుమూరు గంధమహోత్సవం సంప్రదాయబద్దంగా సజావుగా జరగడం సంతోషకరం. కరోనా నేపథ్యంలో సుమారు 250 సంవత్సరాల నాటి సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా గంధమహోత్సవం నిర్వహించడానికి సహకరించిన అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు, భక్తులు, ముజావర్లు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కసుమూరు గ్రామానికి సంబంధించి స్థానిక ప్రజలకు కోట్లాది రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. మస్తాన్ బాబా ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగేలా ముఖ్యమంత్రి గారికి మస్తాన్ బాబా ఆశీస్సులందించాలని ప్రార్ధిస్తున్నా.