కష్టాలున్నా సంక్షేమాన్ని విస్మరించలేదు. అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది ప్రజల ఆశలే ఆశయాలుగా సాగుతున్న జగన్‌ పాలన.. దేశ రాజకీయలనే మలుపు తిప్పుతున్న జగన్ పాలన సీఎం జగనన్నకు మద్దతుగా నిలుద్దాం -మంత్రులు గుమ్మనూరు జయరాం, శంకర్ నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. అనంతపురం(prajaamaravati): గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఖజానా ఖాళీ చేసినప్పటికీ ,కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పటికి ప్రజా సంక్షేమాన్ని ,అభివృద్ధిని విస్మరించకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మంత్రులు శంకర్ నారాయణ, గుమ్మనూరు జయరాం అన్నారు.ఇన్ని కష్టాల్లోనూ జగన్మోహన్ రెడ్డి 60 వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారంటే ఆయన ఎంతలా కష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. సీఎం వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గంలో గత 10 రోజులుగా చేపట్టిన 'ప్రజా చైతన్య పాదయాత్ర' ముగింపు సభ సోమవారం పట్టణంలో ఘనంగా ముగిసింది.మంత్రులు శంకర్ నారాయణ, గుమ్మనూరు జయరాం, ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, యువనేత ప్రణయ్ రెడ్డి ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు.అంతకుముందు పట్టణంలో వైస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.సెంట్రల్ స్కూలు వద్ద నుండి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన వేలాదిమంది ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.అనంతరం టవర్ క్లాక్ సర్కిల్ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో వక్తలు ప్రసంగించారు.ప్రజల ఆశలే ముఖ్యమంత్రి ఆశయాలుగా జగన్‌ పాలన సాగిస్తున్నారని వక్తలు అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి తాను తలపెట్టిన పాదయాత్ర లో ప్రత్యేకంగా ప్రజల నుంచి వారి ఆశలను ఆశయాలుగా చేసుకొని పాలన అందిస్తున్నారని అన్నారు. కోట్లాదిమంది ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రజల సాధక బాధలను తెలుసుకుని పాలన సాగిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.చంద్రబాబు బీసీలకు,మహిళలకు,రైతన్నలకు,నిరుద్యోగులకు చేసిన మాటల గారడి, మోసం గురించి వివరించారు.జగనన్న పాదయాత్ర లో ఇచ్చిన హామీలు అన్ని మాట తప్పకుండా మడమ తిప్పకుండా నెరవేర్చారని తెలిపారు.పక్క రాష్ట్రాలలో మహిళలు జగనన్న పథకాలను చూసి తాముకుడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే బాగుండు అనుకుంటున్నారని..అన్నలా,తమ్ముడిలా,మామలా సొంతకుటుంబ సభ్యుడిలా పరిపాలించే ముఖ్యమంత్రి దేశంలో ఒక్క జగనన్న మాత్రమేనని మంత్రులు,ఎంపి, మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.దేశ రాజకీయలనే జగన్ పాలన మలుపు తిప్పుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.