*రైట్... రైట్...* *ఆటోనగర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్* *స్థలాన్ని పరిశీలించిన ఏపీఐఐసీ ఏడి* *ఎమ్మెల్యే కిలారికి కృతజ్ఞతలు తెలియజేసిన ఆటోనగర్ అసోసియేషన్ సభ్యులు* మూడు దశాబ్దాల పైబడి వందలాది మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కంటున్న కల *ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య* కారణంగా సాకారం కానుంది. ఆయన కృషి ఫలితంగా ఆటోనగర్ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. ప్రతాప్ రెడ్డి తన బృందంతో బుధవారం సాయంత్రం పట్టణానికి విచ్చేసి ఆటోనగర్ నెలకొల్పనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన బృందం *ఎమ్మెల్యే కిలారి రోశయ్య* ను కలిసి భవిష్యత్ కార్యాచరణను వివరించారు. తదనంతరం పట్టణంలోని శ్రీ సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ సాక్షి భావనారాయణ స్వామివారి దేవస్థానంలో *ఎమ్మెల్యే కిలారి రోశయ్య* , ఏపీఐఐసీ బృందం ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆటోనగర్ నిర్మాణం త్వరితగతిన పూర్తికావాలని *ఎమ్మెల్యే కిలారి రోశయ్య* ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఏళ్ళ తరబడి ఎంతో మంది నాయకులకు మొర పెట్టుకున్నా పట్టించుకున్న నాధుడే లేడని... *ఎమ్మెల్యే కిలారి రోశయ్య* ఒక్కడే మా ఇబ్బందులను గుర్తెరిగి ఆటోనగర్ నిర్మాణానికి పూనుకున్నారని, మా జీవితాలలో ఎన్నో ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న పండుగ ఇదంటూ... ఆటోనగర్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ *ఎమ్మెల్యే కిలారి రోశయ్య* కు కృతజ్ఞతలను తెలియజేశారు.


Comments