*వైభవోపేతంగా ఉమ్మారెడ్డి మానసపుత్రిక నామకరణ మహోత్సవం* *విచ్చేసిన రాష్ట్ర ప్రముఖులు* *సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉపసభాపతి* *వందన సమర్పణ చేసిన ఎమ్మెల్యే కిలారి* రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మానసపుత్రిక అయిన కొండుబొట్లు పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నామకరణ మహోత్సవం బుధవారం వైభవోపేతంగా జరిగింది. బాపట్ల మండలం కొండబొట్లపాలెం గ్రామంలోని ఉమ్మారెడ్డి వెంకయ్య-కోటమ్మ మెమోరియల్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నూతన నామకరణ కార్యక్రంలో పాల్గొన్న *పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య.* ఈ కార్యక్రమంలో ఇంచార్జి మంత్రివర్యులు రంగనాధరాజు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆధిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు డొక్కా మణిక్యవారప్రసాద్, జాంగా కృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.