స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పనితీరుపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష..


అమరావతి (ప్రజా అమరావతి).


స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పనితీరుపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష..



*డీజీపీ గౌతం సవాంగ్, రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరు.* 


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


మద్యం, ఇసుకల్లో ఎక్కడా అక్రమాలకు ఆస్కారం ఉండకూడదు: సీఎం

అక్రమ రవాణా చేసిన వారిపై ఉక్కుపాదం మోపాల్సిందే: అధికారులకు స్పష్టం చేసిన సీఎం

అక్రమాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టేవారిని ఉపేక్షించవద్దు: సీఎం

వ్యవస్థలో అవినీతికి  ఆస్కారం ఉండకూడదు : సీఎం

ఎక్కడైనా తప్పులు జరిగాయన్న సమాచారం రాగానే కచ్చితంగా దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి: సీఎం

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఉద్ధృతంగా దాడులు చేయాలి: సీఎం

సరిహద్దు రాష్ట్రాలనుంచి వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న అక్రమ మద్యంపై కచ్చితంగా దృష్టిపెట్టాలి: సీఎం

ఇప్పుడున్న వారేకాకుండా సమర్థత, నిజాయితీపరులైన అధికారులకు ఎస్‌ఈబీలో స్థానం కల్పించండి: సీఎం ఆదేశం

వచ్చే 15 రోజుల్లో కచ్చితంగా మెరుగైన ఫలితాలు రావాలి: సీఎం

ఏదైనా సమాచారం రాగానే దానిపై కచ్చితంగా దృష్టిపెట్టండి:

ప్రతివారం సమావేశమై సమీక్ష చేయండి:

ఎస్‌ఈబీకి కావాల్సిన అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించండి:

ఇందులో పనిచేసేవారికి ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వండి: సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం


*మే 16, 2020న ఏర్పాటైన ఎస్‌ఈబీ (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో)*

*ఎస్‌ఈబీ ఏర్పాటు తర్వాత పనీతీరుపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు...*


*మద్యం అక్రమాల పై చర్యలు :*

ఎస్‌ఈబీ ఏర్పాటైన తర్వాత మద్యం అక్రమాలపై 79,632 కేసులు నమోదు

4,85,009 లీటర్ల మద్యం పట్టివేత

12,766 లీటర్ల బీరు పట్టివేత

4,54,658 లీటర్ల నాటుసారా సీజ్‌

1,12,70,123 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

2,85,142 కేజీల నల్లబెల్లం స్వాధీనం

22,715  వాహనాలు స్వాధీనం

అక్రమాలకు పాల్పడ్డ 240 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కూడా కేసులు నమోదు చేశామని వివరించిన అధికారులు.


*ఇసుక అక్రమాల పై చర్యలు*

ఇసుక విషయంలో 7,244 కేసులు నమోదు

4,79,692 టన్నుల ఇసుక స్వాధీనం

9,689 వాహనాలు సీజ్‌

ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడ్డ 22 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు

మద్యం, ఇసుక అక్రమాలకు పాల్పడ్డ 82 మంది పోలీసులపై కేసులు


*ఇతర అక్రమాలపైనా ఎస్‌ఈబీ కొరడా*


 1,00,979 కేజీల గంజాయి పట్టివేత

90,97,628 గుట్కా ప్యాకెట్ల పట్టివేత

1,120 ఎర్రచందనం దుంగలు పట్టివేత

పేకాట శిబిరాలపై దాడులు చేసి రూ. 4.92 కోట్ల డబ్బు పట్టివేత.

Comments